Allu Arjun : అల్లు అర్జున్‌ బర్త్‌ డే ట్రీట్‌.. ఫ్యాన్స్‌ కు అదిరిపోయే న్యూస్‌!

ఏప్రిల్ 8 న బన్నీ బర్త్‌ డే సందర్బంగా ఓ పాటను పుష్ప 2 చిత్రం నుంచి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పుష్ప సినిమా కు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.

New Update
Allu Arjun : అల్లు అర్జున్‌ బర్త్‌ డే ట్రీట్‌.. ఫ్యాన్స్‌ కు అదిరిపోయే న్యూస్‌!

Allu Arjun Birthday Treat : అల్లు అర్జున్‌(Allu Arjun), సుకుమార్‌(Sukumar) డైరెక్షన్‌ లో వచ్చిన సినిమా పుష్ప(Pushpa)... ఈ సినిమా పాన్‌ ఇండియా(PAN India) లెవల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు గానూ అల్లు అర్జున్‌ జాతీయ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. ఈ సినిమాకు పార్ట్‌ 2 కూడా రాబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ చాలా వేగంగా జరుగుతుంది.

ఈ సినిమాకు సంబంధించి ఒకే ఒక్క టీజర్‌ బయటకు వచ్చింది. అందులో అల్లు అర్జున్‌ని చూసిన ఫ్యాన్స్‌ కి పునకాలే వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఇంకా ఏ వీడియో కూడా బయటకు రాలేదు. సినిమా అప్డేట్‌ కోసం అప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి అతి త్వరలోనే అదిరిపోయే అప్డేట్‌ రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఏప్రిల్ 8 న బన్నీ బర్త్‌ డే(Birthday) సందర్బంగా ఓ పాటను చిత్రం నుంచి విడుదల చేయనున్నట్లు సమాచారం. పుష్ప సినిమా కు దేవీశ్రీ ప్రసాద్‌(Devi Sri Prasad) సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.

అయితే బన్నీ పుట్టిన రోజుకు పాటను విడుదల చేస్తారా.. పోస్టర్‌ రిలీజ్‌ చేస్తారా అనే దాని మీద క్లారిటీ లేదు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతుంది.

Also Read : ఈ 10 ఫుడ్స్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి.. బీపీ, షుగర్…పరార్!

Advertisment
తాజా కథనాలు