Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవలు.. RTV వద్ద ఎక్స్‌క్లూజివ్ సమాచారం!

పుష్ప-2 సినిమా ఆగిపోయిందని, అల్లు అర్జున్‌ - సుకుమార్ మధ్య విభేదాలే దీనికి కారణమని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై RTV.. సుకుమార్‌ టీమ్‌ నుంచి క్లారిటీ తీసుకుంది. ఆ ప్రచారం అబద్ధమని, అది ముందే ఫిక్స్ అయిన టూర్ అని సుకుమార్‌ టీమ్‌ తెలిపింది.

New Update
Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవలు.. RTV వద్ద ఎక్స్‌క్లూజివ్ సమాచారం!

Allu Arjun - Sukumar Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' కు గత కొన్ని నెలలుగా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. నిజానికి ఇప్పటికే షూటింగ్ పూర్తయి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడింది. డిసెంబర్ 6 న సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు.

బన్నీ, సుక్కు మధ్య గొడవలు..

అయితే నిన్నటి నుంచి మళ్ళీ ఈ సినిమాపై కొత్త ప్రచారం ఊపందుకుంది. బన్నీ ఇద్దరూ పుష్ప షూటింగ్ ను పక్కన పెట్టి వెకేషన్ టూర్ కోసం విదేశాలకు వెళ్లారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీతో యూరప్‌కు బన్నీ, అమెరికాకు సుక్కు పయనమయ్యారు. దీంతో పుష్ప-2 సినిమా ఆగిపోయిందని, అల్లు అర్జున్‌, సుకుమార్ మధ్య విభేదాలే దీనికి కారణమని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై RTV సుకుమార్‌ టీమ్‌ నుంచి క్లారిటీ తీసుకుంది.

Also Read : జాన్వీ కపూర్ కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిన ‘దేవర’ బ్యూటీ!

సుకుమార్ టీమ్ క్లారిటీ..

దాని ప్రకారం.. విభేదాల ప్రచారం అబద్ధమని సుకుమార్‌ టీమ్‌ చెప్పింది. అది ముందే ఫిక్స్ అయిన టూర్ అని, అల్లు అర్జున్‌ తిరిగి రాగానే షూటింగ్‌ ప్రారంభం అవుతుందని తెలిపింది. నిజానికి సినిమా ఆలస్యం వెనుక పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్‌ షెడ్యూల్‌ కారణమని, ఫాహద్‌ ఫాజిల్‌ కాల్‌షీట్లు దొరక్కపోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతుందని వెల్లడించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు