Arya 20 Years Event : 'ఆర్య' నా జీవితాన్ని మార్చిన సినిమా, ఆ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉంటా.. బన్నీ, సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్! 'ఆర్య' ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈవెంట్ 'ఆర్య' సినిమా తన జీవితాన్నే మార్చేసిందని బన్నీ చెప్పగా.. దిల్ రాజు తనను నమ్మి అవకాశం ఇచ్చారని, దానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. By Anil Kumar 08 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Allu Arjun And Sukumar Emotional Comments On Arya Movie : ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) కి హీరోగా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా ‘ఆర్య'(Arya). ఈ మూవీతో సుకుమార్ టాలీవుడ్(Tollywood) కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ బన్నీ కి ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పనవరసరం లేదు. ఈ సినిమా బన్నీ, సుక్కు ఇద్దరి జీవితాలనే కాదు ఇంకెంతో మంది జీవితాలను మార్చేసింది. కాగా ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మూవీ టీమ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, సుకుమార్ ఆర్య మూవీ పట్ల ఎమోషనల్ కామెంట్స్ చేశారు. Also Read : రణ్ వీర్-దీపిక విడాకులు.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన నటుడు! ఆర్య నా జీవితాన్నే మార్చేసింది ఆర్య 20 ఇయర్స్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. " నా జీవితాన్నే మార్చేసిన సినిమా ఇది. అలాగే నా జీవితాన్ని ప్రభావితం చేసిన దర్శకుడు సుకుమార్. ఆర్య అనే సినిమా నా కెరీర్ ని ట్రాక్ లోకి తీసుకొచ్చింది" అని అన్నాడు. ఎప్పటికీ రుణపడి ఉంటా ఇదే ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.." కొత్త డైరెక్టర్స్ ని ఎవరూ ఎంకరేజ్ చెసేవాళ్ళు లేని సమయంలో దిల్ రాజు ఎంతో ధైర్యంతో నాతో సినిమా చేశారు. ఆ విషయంలో ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటా. బన్నీ తన ఫ్యూచర్ ని తానే వెతుకున్నట్లు పట్టుబటట్టి మరి ఈ సినిమా చేశాడు" అని చెప్పారు. కాగా ఈ ఈవెంట్ లో బన్నీ, సుకుమార లతో పాటూ దిల్ రాజు, అల్లు అరవింద్, శివ బాలాజీ, రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. #tollywood #allu-arjun #sukumar #arya-20-years-event మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి