Allu Arjun : 'పుష్ప 2' కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

'పుష్ప 2' కోసం అల్లు అర్జున్ భారీగా రెమ్యునరేషన్ పెంచేసాడు. పార్ట్ -1 కోసం 100 కోట్లు తీసుకున్న బన్నీ.. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాకి ఏకంగా 150 కోట్లు అందుకోబోతున్నట్లు తాజా సమాచారం

New Update
Allu Arjun : 'పుష్ప 2' కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Pushpa 2 : 'పుష్ప' సినిమా అల్లు అర్జున్(Allu Arjun) కి ఎలాంటి పాపులారిటీని తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటిదాకా రీజినల్ హీరోగా ఉన్న బన్నీ 'పుష్ప' తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్(PAN India Star) అయిపోయాడు. 'పుష్ప' తో విదేశాల్లోనూ అల్లు అర్జున్ కి క్రేజ్ ఏర్పడింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ యాక్టింగ్ కి ఏకంగా నేషనల్ అవార్డు(National Award) సైతం వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'పుష్ప2' పై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

పార్ట్-1 కంటే రెట్టింపు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు 300 కోట్లకి పైగా బడ్జెట్ పెడుతున్నారు. దానికి తోడూ ఈసారి పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం కాస్త పక్కన పెడితే.. 'పుష్ప 2' కోసం బన్నీ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తాజాగా ఓ న్యూస్ బయటకి వచ్చింది. రీసెంట్ గానే 'పుష్ప 2' కి భారీ బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ డీల్ ఇటీవలే క్లోజ్ అయిందట. 'పుష్ప 2' ఓటీటీ రైట్స్ ఏకంగా 275 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. దానికి ముందు నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 200 కోట్లు పలికింది.

కాగా 'పుష్ప2' కి భారీగా బిజినెస్ జరగడంతో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. 'పుష్ప' పార్ట్-1 కి 100 కోట్లు తీసుకున్న బన్నీ.. ఇప్పుడు 'పుష్ప 2' కోసం ఏకంగా 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు లేటెస్ట్ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఇండియా లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత మొత్తాన్ని బన్నీ రెమ్యునరేషన్ గానే తీసుకుంటాడా? లేక లాభాల్లో వాటా తీసుకుంటాడా? అనేది చూడాలి.

Also Read : ఫోటోగ్రాఫర్ పై తారక్ సీరియస్.. అలా చేయొద్దంటూ వార్నింగ్? వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు