Pushpa 2 Teaser: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. పుష్ప-2 టీజర్ రిలీజ్ ఆ రోజే ..!

అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం పుష్ప-2. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న పుష్ప-2 టీజర్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Pushpa 2 Teaser: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..  పుష్ప-2 టీజర్ రిలీజ్ ఆ రోజే ..!
New Update

Pushpa 2 Teaser: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పుష్ప పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. పుష్ప 2 పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Also Read : Jai Hanuman : గూస్‌ బంప్స్‌ గ్యారెంటీ.. జై హనుమాన్‌ నుంచి అదిరే అప్‌డేట్.. “అంజనాద్రి 2.0”

publive-image

అయితే పుష్ప 2 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు ఫ్యాన్స్. నిత్యం సోషల్ మీడియా వేదికగా మూవీ అప్డేట్స్ గురించి కామెంట్స్ పెడుతూనే ఉన్నారు.  కానీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్ లేకపోయింది.

publive-image

పుష్ప 2 టీజర్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే

ఈ క్రమంలో సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు బన్నీ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్‌. తాజాగా ఓ నెటిజన్ .. త్వరలో అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. ఇప్పుడైనా అప్డేట్ ఇస్తారా ...! అంటూ ట్వీట్ చేశాడు. దీనికి శరత్ స్పందిస్తూ.. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ రాబోతున్నట్లు తెలిపారు. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : Hero Nitin : పవన్ టైటిల్ తో నితిన్ మూవీ.. అదిరిపోయిందిగా .. ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ 

#pushpa-2-teaser #pushpa-2 #allu-arjun-pushpa-2
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe