Allu Arjun Desamuduru : తెలుగు సినీ పరిశ్రమలో గంగోత్రి(Gangotri) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నేడు(Pushpa) పుష్ప తో జతీయ స్తాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే స్టైల్ కు పెట్టింది పేరు. ఈయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు. వాటిలో పూరీ జగన్నాథ్(Puri Jagannath) కాంబోలో వచ్చిన దేశముదురు(Desamuduru) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
పూర్తిగా చదవండి..17 ఏళ్ళు పూర్తి చేసుకున్న దేశముదురు
2007 జనవరి 12 న సంక్రాంతి(Sankranti) బరిలోకి దిగిన దేశముదురు చిత్రం బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. 17 ఏళ్లు పూర్తి చేసుకున్న దేశముదురు చిత్రం బన్నీ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా. ఈ మూవీలో బన్నీ సిక్స్ ప్యాక్ లో అలరించడం విశేషం. అంతవరకు ఒక్క సీనియర్ హీరో అర్జున్ తప్ప ఎవరికి సిక్స్ ప్యాక్ లేదు. అలాంటి టైంలో ఫస్ట్ టైం ఒక హీరో కి సిక్స్ ప్యాక్ ఉంటే ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఏర్పడుతుందో దేశముదురు సినిమా నిరూపించింది. పూరీ స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆపిల్ బ్యూటీ హన్సిక(Hansika) గ్లామర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దుమ్మురేపే పర్ఫార్మెన్స్, చక్రి బాణీలు ఈ సినిమాను తారాస్థాయికి తీసుకెళ్ళాయి. ఇక..ఈ సినిమా నుంచే యూత్ లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలయింది.ఇంతటి ప్రత్యేకతలు కలిగిన సినిమా కాబట్టే దేశముదురు చిత్రం 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా(Allu Arjun) అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.
17 years of #Desamuduru Movie . What a beautiful moment in time . Thanks to my director @PuriConnects , my producer @DVVMovies and the entire cast & crew . Gratitude forever to my fans and audience for a memorable blessing 🙏🏽
— Allu Arjun (@alluarjun) January 12, 2024
బన్నీపోస్ట్ వైరల్
17 ఏళ్ల దేశముదురు సినిమా షూటింగ్ రోజులు ఎన్నో ఆనందకర క్షణాలను ఇచ్చింది. నా దర్శకుడు పూరి జగన్నాథ్ గారికి ,నా నిర్మాత దానయ్య గారికి మరియు మొత్తం తారాగణానికి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. చిరస్మరణీయమైన ఈ విజయన్నిచ్చిన నా అభిమానులకు మరియు ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు అంటూ బన్నీ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
నాలుగేళ్ల ‘అల వైకుంఠపురములో’
ఇక.. 2020 సంక్రాంతి బరిలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయిన అల .. వైకుంటపురంలో చిత్రం విడుధలయి నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కుడా బన్ని ట్వీట్ చేసారు. త్రివిక్రమ్ దర్సకత్వంలో వచ్చిన ఈ సినిమా బన్ని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. తమన్ పాటలకు పాన్ ఇండియా ఉర్రూతలూగిపోయింది. పూజా హెగ్డే గ్లామర్ , బన్ని పెర్ఫర్మేన్సే ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి. కూల్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ అల .. వైకుంటపురంలో బన్నీ ఖాతో ఎప్ప్పటికే మరచిపోలేని బ్లాక్బస్టర్.
మేకింగ్ పోటోలను షేర్ చేసిన బన్నీ
ఈ మూవీ విడుదలయి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆ అద్భుతమైన ఎంటర్టైనర్ ని ఎప్పటికీ గుర్తుండిపోతుందని అల వైకుంటపురం మూవీ నుండి కొన్ని మేకింగ్ ఫోటోలని షేర్ చేసారు అల్లు అర్జున్. ట్విట్టర్ లో పెట్టిన ఈ పోస్ట్ ప్రెజెంట్ నేట్టింట వైరల్ గా మారాయి.
4 years of AVPL . The sweetness still remains in my heart . Thanks to all of you … for such a memorable blessing. Gratitude forever 🙏🏽 pic.twitter.com/VcnnlGUsER
— Allu Arjun (@alluarjun) January 12, 2024
ALSO READ : థియేటర్ హను మాన్ వర్సెస్ ఓటిటి హనుమాన్ .. ఒకే రోజు రెండు హనుమాన్ లు సందడి