Pushpa : తగ్గేదెలే.. పుష్ప పార్ట్ 3 కూడా.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

అల్లు అర్జున్.. తాజాగా బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఇండియన్ ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు అల్లు అర్జున్. పుష్ప పార్ట్ 3 కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

New Update
Pushpa : తగ్గేదెలే.. పుష్ప పార్ట్ 3 కూడా.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

Pushpa 3 : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ(Cinema Industry) లో సీక్వెల్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒక్కప్పుడు సినిమా అంటే రెండున్నర గంటలు మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు కథ మారింది. ఒక పెద్ద స్కేల్ సినిమా అనగానే ఖచ్చితంగా రెండు భాగాలుగా వస్తుందని అర్థమవుతుంది. దర్శకులు  పార్ట్ 1, పార్ట్ 2 అంటూ  సీక్వెల్స్ గా తెరకెక్కిస్తూ.. సినిమా రేంజ్ ను పెంచుతున్నారు. ఇక కొన్ని సినిమాలైతే పార్ట్ 3కి కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఇదే లిస్ట్ లో చేరింది ఓ స్టార్ హీరో సినిమా.

Also Read : Allu Arjun : బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ కు ఆహ్వానం.. ‘పుష్ప’ స్పెషల్ స్క్రీనింగ్

2021 లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో రిలీజైన ఈ సినిమా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికీ ఈ సినిమా హవా కొనసాగుతూనే ఉందని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే తాజాగా బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Berlin International Film Festival) పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప(Pushpa) మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

పుష్ప పార్ట్ 3 కూడా ఉండొచ్చు..

బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఇండియన్ ప్రతినిధిగా హాజరైన అల్లు అర్జున్.. అక్కడ పుష్ప స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా జర్మన్ మీడియా(Jerman Media) తో మాట్లాడిన అల్లు అర్జున్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "పుష్ప పార్ట్-3 కూడా ఉండే అవకాశం ఉంది.. ఈ సినిమాను ఒక ప్రాంచైజీల చేయాలనే ఆలోచన ఉందంటూ తెలిపారు. ఇక బన్నీ చేసిన ఈ కామెంట్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే  పుష్ప 2 పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప 2 లో  పుష్పరాజ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని.. పుష్ప రాజ్ కు ఎదురయ్యే  సవాళ్ళను  ఆడియన్స్ ఊహకు మించి భారీ స్కెల్ లో.. సుకుమార్ చూపించబోతున్నారని మాట్లాడారు. దీంతో ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Also Read : Rashmika Mandanna : అరుదైన ఘనత సాధించిన రష్మిక.. ‘ఫోర్బ్స్ అండర్ 30’ లో చోటు

Advertisment
తాజా కథనాలు