ఆఫర్లు ఎన్ని వచ్చినా కమిట్‌మెంట్‌ కోసమే నిలబడ్డాం : అల్లు అరవింద్‌!

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే పాన్ ఇండియా సబ్జెక్టుతో రాబోతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్నారు.

New Update
ఆఫర్లు ఎన్ని వచ్చినా కమిట్‌మెంట్‌ కోసమే నిలబడ్డాం : అల్లు అరవింద్‌!

Allu Aravind : నాగచైతన్య(Naga Chaitanya) సాయి పల్లవి(Sai Pallavi) కాంబోలో వచ్చిన లవ్‌ స్టోరీ అనే సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబోలనే మరో మూవీ తండేల్‌ అనే ఓ పాన్‌ ఇండియా చిత్రం రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పనులను శనివారం హైదరాబాద్ లో చిత్రం బృందం ప్రారంభించింది.

నాగ చైతన్య కోసం ఈసారి ఏకంగా నాగార్జున , వెంకటేశ్ ఇద్దరు కలిసి వచ్చారు. ఒకరు స్విచ్‌ ఆన్‌ చేయగా, మరోకరు క్లాప్‌ ఇచ్చారు. ఇక పూజా కార్యక్రమాల తరువాత చిత్ర యూనిట్‌ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో చిత్ర ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌(Allu Aravind) మాట్లాడుతూ.. '' ఈ చిత్రానికి సంబంధించిన మా ప్రయత్నం ఏడాదిన్నర క్రితం మొదలు పెట్టాం. ఆ ప్రయత్నమే ఇప్పుడు పూజా కార్యక్రమాల వరకు వచ్చింది.

ప్రస్తుతం ఓ సబ్జెక్ట్‌ ను ఎలా తీర్చిదిద్దాలని చిత్ర బృందం కష్టపడుతుంది. షూటింగ్ ఎప్పుడు అనేది ఎలాంటి కంగారు లేకుండా..కథను అనుకున్నట్లుగా చేయాలని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా సినిమా తీయాలని చిత్ర బృందం ప్రయత్నిస్తుందని వివరించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ దర్శకునికి హిట్‌ వస్తే..లెక్కలేనన్ని ఆఫర్లు వస్తుంటాయి.

కానీ దానికి ముందే ఎప్పుడో ఉన్న కమిట్‌మెంట్లను అలా పాటించడమంటే మామూలు విషయం కాదు..సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అలా పాటించేవారిలో రాజమౌళి ఒకరు. ఎంత మంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా.. నేను గీతా ఆర్ట్స్‌లోనే చేస్తాను అని ఆ కథను పట్టుకుని చందూ మొండేటి జర్నీ చేశారు..ఆ కథకు నాగ చైతన్య కరెక్ట్‌గా సూట్ అవుతారని అనుకున్నాడు.. నాగ చైతన్యకు కథ చెబితే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు.

ఇక చైతూకి మంచి జోడి కావాలి. మా బంగారు తల్లి సాయి పల్లవి కూడా కథ విని ఫుల్‌ ఇంప్రెస్‌ అయ్ఇయంది. ప్రస్తుతం సినిమాలన్నీ కూడా పాన్‌ ఇండియా సైజులో వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి కూడా. ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమా అనుకున్నప్పుడు దీనికి సంగీతం కోసం దేవి శ్రీ ప్రసాద్ రావడం, శ్యాం కెమెరామెన్‌ గా దొరకడం నా అదృష్టం.

నా మీటింగ్‌ రూంలో చిన్న చిన్న పడవలు తయారు చేసుకుని సినిమా ఎలా చేయాలని ఆలోచించేవారు. ఇలాంటి సినిమా కోసం నేను కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను..చందూకి ఆల్ ది బెస్ట్‌ తండేల్ అంటే చాలా మందికి చాలా డౌట్లున్నాయ్.. అవి అలానే ఉంచండి.. మాట్లాడుతూ ఉండండి’ అని అన్నారు.

Also read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు