Teacher jobs: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే?

తెలంగాణలో రాబోయే మెగా డీఎస్సీలో స్పెషల్ ఎడ్యూకేషన్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ టీచర్ పోస్టులు స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రైడ్‌ టీచర్‌ తోపాటు తోపాటు నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

New Update
Teacher jobs: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే?

Telangana Dsc: తెలంగాణలో గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ మరిన్ని పోస్టులను జతచేస్తూ 11062లకు గానూ కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అయితే జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య పెంచగా స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్ పండిట్, ఉపాధ్యాయులు, ఎస్జీటీ పోస్టులతో పాటు ఈసారి కొత్తగా స్పెషల్‌ ఎడ్యూకేషన్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌..
ఈ మేరకు మంచిర్యాల జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 70, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులు 16, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు 3, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు 176 ఉన్నాయి. మొత్తం 265 సాధారణ టీచర్‌ పోస్టులతో పాటు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 5, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ సెకండరీ గ్రైడ్‌ టీచర్‌ పోస్టులు 18, రెండు విభాగాల్లో కలిపి 23 పోస్టులున్నాయి. అన్ని టీచర్‌ పోస్టులు కలిపి జిల్లాలో 288 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు బీఈడీ, ఎస్‌జీటీ పోస్టుకు టీటీసీ, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులకు టీపీటీ, హెచ్‌పీటీ ఉత్తీర్ణత తోపాటు టెట్‌ అర్హత తప్పనిసరి. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: TS DSC: 4 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు నిరాశ!

అలాగే ఈసారి అభ్యర్థుల వయసు మరో రెండేళ్లు పొడగించగా పోటీదారుల సంఖ్య పెరగనుంది. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే వారి నిర్ధిష్ట వయస్సును 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు. అంతేకుండా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు కొత్తగా పోస్టులను ప్రవేశ పెట్టారు. దీంతో బీఈడీ, డీఈడీ స్పెషల్‌ ఎడ్యూకేషన్‌ కోర్సు చేసిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. పాత నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టులకు తోడు మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓసీ అభ్యర్థులకు 46 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 51 ఏళ్లు, దివ్యాంగులకు 56 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు