Telangana Ministers Final List: మొన్న 7వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డితో పాటూ 11 మంది మంత్రులుగా కాంగ్రెస్ నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు మొదటి అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో వారి శాఖలను అనౌన్స్ చేశారు నూతన సీఎం రేవంత్. దీని కోసం నిన్న ఢిల్లీ వెళ్ళిన ఆయన అర్ధరాత్రి వరకూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ లతో సుదీర్ఘ మీటింగ్ నిర్వహించారు. ఆల్రెడీ ప్రమాణం చేసిన వారికి శాఖలను కేటాయించారు.
Also Read:పార్లమెంటులో యానిమల్ రచ్చ..ఇలాంటి సినిమాలు అవసరమా అన్న కాంగ్రెస్ ఎంపీ
భట్టి - ఆర్థిక శాఖ
ఉత్తమ్ - సివిల్ సప్లై , నీటి పారుదల శాఖ
శ్రీధర్ బాబు - IT , పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ
దామోదర రాజనర్శింహ - ఆరోగ్య శాఖ
తుమ్మల - వ్యవసాయ శాఖ
జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్ శాఖ
పొంగులేటి - I&PR శాఖ
సీతక్క - పంచాయితీ రాజ్ , మహిళ శిశు సంక్షేమ శాఖ
కోమటిరెడ్డి - R&B
పొన్నం ప్రభాకర్ - రవాణా శాఖ
కొండా సురేఖ -అటవీశాఖ
తుమ్మల నాగేశ్వర్రావు - వ్యవసాయ శాఖ
అయితే ఇందులో అతి కీలకమైన హోంమంత్రి శాఖను మాత్రం సీెం రేవంత్ రెడ్డి తన వద్దనే ఉంచుకున్నారు. మొత్తం గాడితప్పిన హొమ్ శాఖ వ్యవస్థ ను చక్కదిద్దే పనిలో భాగంగా తన వద్దనే ఉంచుకున్నట్టు తెలుస్తోంది.