Alleti Maheshwar Reddy: తెలంగాణలో రాజకీయాలు మొత్తం రుణమాఫీపై జరుగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. హరీష్ రావు తో (Harish Rao) ఛాలెంజ్ కి దిగి రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ లో (Congress) చేరతారని రేవంత్ పదే పదే చెప్తున్నారని.. హరీష్ రేవంత్ రెడ్డి తీరుపై తనకు అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు హరీష్ ప్రాతినిథ్యం వహించబోతున్నారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు
రాజకీయ సన్యాసం తీసుకుంటా..
రుణమాఫీ ఒక్కటి చేస్తే మిగతా హామీల మాటేమిటి? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర రెడ్డి. రేవంత్ ఇచ్చిన గ్యారెంటీ లు అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ విసిరారు. స్పీకర్ ఫార్మాట్ లో నేను నా రాజీనామా లేఖ పంపిస్తా అని అన్నారు. ఈ ఛాలెంజ్ కు సిద్దమా? అని సీఎం రేవంత్ కు సవాల్ చేశారు. షిండే ను తయారు చేసుకునేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ నాటకాలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు.
రేవంత్ మీది అటూ ఇటు గాని పార్టీ అని ఎద్దేవా చేశారు. అసలు మీ కెప్టెన్ ఎవరు? అని ప్రశ్నించారు. రేవంత్ కెప్టెన్ లేకుండా మ్యాచ్ ఎలా ఆడతారని అన్నారు. పెద్దోళ్ల మీద రాయి వేస్తే పెద్దోడిని అవుతానని రేవంత్ అనుకుంటున్నారని విమర్శించారు. మోడీ నీ విమర్శించే స్థాయి రేవంత్ కు లేదని అన్నారు. 400 సీట్లలో పోటీకి కూడా కాంగ్రెస్ దగ్గర అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు.