Movies: ఆ ఒక్కటీ అడక్కు అంటున్న అల్లరి నరేష్..టీజర్ రిలీజ్

కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్‌ను ఏర్పరచుకున్న అల్లరి నరేష్ ఒక కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. మధ్యలో డిఫరెంట్ మూవీస్ చేసి సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ కామెడీ ట్రాక్ పట్టాడు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ కొత్త సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు.

Movies: ఆ ఒక్కటీ అడక్కు అంటున్న అల్లరి నరేష్..టీజర్ రిలీజ్
New Update

Allari Naresh Movie Teaser Released:  అల్లరి సినిమాతో అల్లరల్లరి చేశాడు దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకు నరేష్. కామెడీ హీరోగా కొన్నాళ్ళు హడావుడి చేశాడు. కానీ వరుసగా ఒకే టైపు సినిమాలు రావడం...అవి ఫ్లాపులు అవ్వడంతో కొత్త తరహా దారిలోకి వెళ్ళాడు. మధ్య మధ్యలో సోర్టింగ్ రోల్స్‌లో కూడా మెరిసాడు. నాంది అనే సినిమాతో సీరియస్ రోల్స్ కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. 2021 లో అతని నుంచి వచ్చిన నాందీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి లాభాలను అందించింది. ఇక మొత్తానికి అల్లరి నరేష్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు అని అందరూ అనుకున్నారు. అయితే తరువాత వచ్చిన రెండు సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కాడు అల్లరి నరేష్. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో పూర్తిస్థాయిలో కామెడీ సినిమాలతో మినిమం సక్సెస్ అందుకుంటూ వచ్చిన నరేష్ మళ్ళీ అదే రూట్లో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో పాతతరం నటుడు రాజేంద్రప్రసాద్ ఒక సినిమా చేశారు. దానికి నరేష్ వాళ్ళ నాన్న ఇవివినే దర్శకుడు. ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్‌తో నరేష్ వచ్చేస్తున్నాడు. దీని టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. 25 రోజుల్లో పెళ్లి జరగకపోతే అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సి వస్తుంది రఘు బాబు డైలాగ్ తో అసలు కథ స్టార్ట్ అవుతుందని అర్ధమవుతుంది. సినిమా మొత్తం నరేష్ పెళ్ళి చుట్టూ తిరగనుందని అర్ధం అవుతోంది. ఇక అతనికి ఎలాగైనా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తూ ఉండడం.. మరొకవైపు చుట్టుపక్కల వారు కూడా అల్లరి నరేష్ పెళ్లి ఎప్పుడు అని విసిగిస్తూ ఉండడం...దానిలో పండే కామెడీతో సినిమా మొత్తం ఉండనుంది. పక్కనే వెన్నెల కిషోర్ కూడా ఒక కామెడీ క్యారెక్టర్ తో కనిపించనున్నాడు. కామెడీ, లవ్, యాక్షన్ అన్నీ ఉన్న ఫుల్ మీల్స్ సినిమాగా ఆ ఒక్కటీ అడక్కు సినిమా రానుంది.

ఈ సినిమాలో నరేష్‌కు జోడిగా ఫారియా అబ్దుల్లా నటిస్తోంది. పెళ్ళి కుదరని నరేష్‌ ఈమెతో ప్రేమలో పడడం దానికి ఫారియా ఆ ఒక్కటీ అడక్కు అనడం టీజర్‌లో కనిపిస్తోంది. మీకు ఓకే అయితే పెళ్లి చేసుకుంటాను అనే మాట చెప్పగానే ఆ ఒక్కటి అడక్కు అంటూ అల్లరి నరేష్ కు ట్విస్ట్ ఇస్తుంది. ఇక అందుకు కారణం ఏంటి? అనే పాయింట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తుంటే రెగ్యులర్ కామెడీ యాంగిల్ లోనే సినిమా ఉన్నట్లు అనిపిస్తుంది. టైటిల్ తగ్గట్టుగా సినిమాలో ఏదైనా కొత్త పాయింట్ ఉంటే జనాలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా రోజుల నుంచి హిట్ లేక సతమతమవుతున్న అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో అయినా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. మల్లి అంకం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు.

Also Read:Delhi: ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ల పెళ్ళి..భారీ భద్రత

#aa-okkati-adakku #telugu #movies #allari-naresh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe