Body Dysmorphia: బాడీ డిస్‌మార్ఫియా డిజార్డర్‌తో బాధ పడే వ్యక్తి శరీరాకృతి తీరులోని లోపాల గురించి బాధపడుతూ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఈ లోపాలు ఎదుటివాళ్లకు కూడా ఉంటాయని గుర్తించలేరు. ఇది ముఖ్యంగా టీనేజర్లు, యువకులలో ఎక్కువగా కనిపించే రుగ్మత. రూపాన్ని పదేపదే చూసుకుంటూ ఒత్తిడికి గురవ్వుతుండటం.. హెయిర్‌స్టైల్ తరుచుగా మర్చేయడం.. తరుచుగా సెల్ఫీలు తీసుకోవడం, శరీరంలోని కొన్ని ప్రాంతాను దాచేయత్నం చేయడం ఈ డిజార్డర్‌కు లక్షణాలు. మెదడు నిర్మాణం, రసాయనిక చర్యలతో పాటు బాల్యంలో నిర్లక్ష్యానికి గురవ్వడం లాంటి కారణాల వల్ల ఈ రుగ్మత రావొచ్చు.
డిస్‌మార్ఫియా డిజార్డర్‌తో బాధపడిన వాళ్లలో మైఖేల్ జాక్సన్ ఒకడు. అతనికి తన ముక్కు నచ్చలేదు. దాని వల్ల లెక్కకు మించి ప్లాస్టిక్ సర్జరీలు చేసి చివరకు ప్లాస్టిక్ ముక్కు అంటించాల్సి వచ్చింది. మగవారికి తమ జుట్టు, కళ్లు, భుజాలు.. వీటిలో ఏదో ఒకటి అస్సలు బాగలేదనే భావన బాల్యంలోనో టీనేజీలోనో స్థిరపడి ఉంటుంది. ఆడవాళ్లకు తమ కళ్లు, ముక్కు, పెదవులు, శరీర రంగు... వీటిలో ఏదో ఒక అవయవం గురించి అసంతృప్తి ఏర్పడుతుంది. నిజానికి లోకంలో ఎవరూ చెక్కినట్టుగా ఉండరు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి.
Also Read:USA: పెన్సిల్వేనియాలో ఆశ్చర్య గొలిపే ఘోస్ట్ సిటీ..