BJP MP Bandi Sanjay : అర్హులైన వారందరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కరీంనగర్(Karimnagar) ప్రజలకు పిలుపునిచ్చారు. 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర'లో భాగంగా చింతకుంట ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్.. కేంద్రం ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏయే కార్యక్రమాలు చేస్తోంది? ఏయే పథకాలను అమలు చేస్తున్నారనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రచార రథాలు ఊరూరా తిరుగుతున్నాయన్నారు. ఈ యాత్ర సందర్భంగా వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అర్హులైన వారంతా ఆయా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన ఉందా? లేదా? లబ్దిదారులున్నారా? లేరా? ఏయే అభివ్రుద్ధి పనులు చేస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్, జీరో అకౌంట్, సుకన్య సమ్రుద్ధి యోజన, ముద్ర రుణాలపై అధికారులు అవగాహన కల్పించారు. పేద ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీ(Narendra Modi) నే అని, కేంద్రమే టాయిలెట్ నిర్మిస్తోంది. ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్ ఇస్తోంది. ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది. ఉపాధికి ఢోకా లేకుండా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. గ్రామాల్లో రోడ్లు, రైతు వేదికలు, పల్లె ప్రక్రుతి వనాలుసహా అభివ్రుద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోందన్నారు. అలాగే రోడ్లు, లైట్లకు కేంద్రమే పైసలిస్తోంద్న ఆయన.. అర్హులందరికీ కేంద్ర ఫలాలు అందేలా చేయడమే లక్ష్యంగా ‘‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : ఆర్జీవీ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానన్న కొలికపూడి శ్రీనివాస్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన వర్మ
అలాగే కేంద్రం అమలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నట్లు బీఆర్ఎస్(BRS) ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ది పొందాలని చూసిందని విమర్శించారు. రేషన్ బియ్యం, గ్యాస్ కనెక్షన్లు, ఉపాధి హామీతోపాటు గ్రామాల్లో జరిగే అభివృధ్ది, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోందఅన్నారు. కానీ సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్లు మోదీ గారు ఇంత గొప్ప పనులు చేస్తుంటే ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వం కొట్టేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ విధానం మారాలి. అధికారులు కూడా ఈ విషయంలో చొరవ చూపాలని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందని లబ్ధిదారులకు వేగంగా వాటిని చేరేలా చేయాలని కోరారు.
మోదీ ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు అందిస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి(PM-Kisan Samman Nidhi) పేరుతో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తోంది. ఫసల్ బీమా పేరుతో పంట నష్టపోయిన రైతును ఆదుకుంటోంది. కనీస మద్దతు ధరను రెట్టింపు చేసింది. అయినా రైతుకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం రావడం లేదు. దీంతో కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేసి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవడమే కాకుండా పంట దిగుబడి ఎట్లా పెంచుకునేందుకు కేంద్రం అనేక కార్యక్రమాలు చేస్తోంది. డ్రోన్లను ఉపయోగించి ఎరువులు చల్లి పెట్టుబడి వ్యయాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చో చెబుతోందన్నారు. అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన, మాతృ వందన స్కీం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం వంటి పథకాలకు సంబంధించి అర్హులుగా ఉండి.. ఇప్పటివరకు నమోదు చేసుకోని.. వాటి ద్వారా లబ్ధి పొందని వారికి ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ కోరారు. చివరగా భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్ది విశ్వగురుగా మార్చాలన్నదే మోదీగారి లక్ష్యమని, ఆ గొప్ప ఆశయానికి అండగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. ఈ లక్ష్యం నెరవేరాలంటే అధికారుల భాగస్వామ్యంతోపాటు మీడియా, మేధావుల, విద్యావేత్తల, స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం. వారిని కూడా ఇందులో భాగస్వాములను చేయాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.