Srisailam: కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. అధికారుల కీలక ప్రకటన! శ్రీశైలంలో కార్తీక మాస రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారాలతో పాటు ప్రత్యేక రోజులలో స్వామి వారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. By Bhavana 13 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి శ్రీశైలం (Srisailam) పుణ్య క్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసం (Karthikamasam) ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 12 వరకు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారికి ప్రత్యేకంగా నిర్వహించే గర్భాలయం, సామూహిక అభిషేకాలను రద్దీ రోజుల్లో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్ది రాజు తెలిపారు. శనివారం, ఆదివారం, సోమవారాలతో పాటు సెలవు రోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. కార్తీక మాసం సందర్భంగా స్వామి వారి ఆలయానికి శని, ఆది , సోమవారాల్లో భక్తులకు కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఇలాగే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శని, ఆది, సోమ , కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక , గర్భాలయ అభిషేకాలు , స్పర్స దర్శనాలు రద్దు చేశారు. మామూలు రోజుల్లో కూడా సామూహిక, గర్భాలయ అభిషేకాలు పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, శుద్ద , బహుళ ఏకాదశులు , ప్రభుత్వ సెలవు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాలతో పాటు చుట్టు పక్కల కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పున్నమి సందర్భంగా జ్వాలా తోరణం, పుణ్య నదీ హారతి ఏర్పాట్లు, కార్తీక మాసంలో ఆకాశ దీపం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. రద్దీ రోజుల్లో ప్రస్తుతం ఉన్న ఏడు విక్రయ కేంద్రాలకు తోడు అదనపు కౌంటర్ల ఏర్పాటు చేయనున్నారు. కార్తీక పౌర్ణమి నవంబర్ 27న ఉన్నప్పటికీ కూడా ఆరోజు పౌర్ణమి ఘడియలు మధ్యాహ్నం వరకే ఉన్నాయి. అందుకే ముందురోజే 26 వ తేదీనే (రెండవ ఆదివారం నాడే) ప్రదోష కాలంలో పౌర్ణమి ఘడియలు ప్రారంభం అయ్యాయి. అందుకే 26 సాయంత్రమే కృష్ణవేణీ నదీమాతల్లికి పుణ్య నదీ హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమ నిర్వహిస్తారు. Also read: కార్తీక మాసం ఎప్పటి నుంచి..పాటించాల్సిన నియమాలు ఏంటి! #kurnool #srisailam #andhrapradesh #karthikamasam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి