Ganesh Immersion in Hyderabad: భాద్రపద శుద్ధ చవితి రోజున భూలోకానికి విచ్చేసి.. తిమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకుని, వారు అర్పించిన నైవేద్యాలను ఆరగించిన గణపయ్య.. కైలాసానికి తిరుగుపయనమయ్యేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నాడు బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో గణనాథుల విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గణేషుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు. భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే మహానగరం వ్యాప్తంగా మరో 100 చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. గణేషుడి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి దుర్ఘటనలు జరుగకుండా చూసేందుకు హుస్సేన్ సాగర్‌తో పాటు.. ఇతర నీటి కొలనుల వద్ద 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇక మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. దాదాపు 40 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 25వేల మందితో భద్రత కట్టుదిట్టం చేశారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13వేల మంది బలగాలు మోహరించాయి. బందోబస్తు విధుల్లో ఆర్ఏఎఫ్, పారా మిలటరీ, అదనపు బలగాలు పాల్గొననున్నాయి. బందోబస్తుకు వచ్చిన పోలీసులు.. దాదాపు 36 గంటల పాటు విధుల్లో ఉండనున్నారు.
కాగా, వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు అధికారులు. నగరం మొత్తాన్ని డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు సీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు. దాదాపు, 3,600 సీసీ కెమెరాలను ఇప్పటికే అనుసంధానించారు అధికారులు. వివిధ శాఖాధికారులు సమన్వయంతో పర్యవేక్షించేలా కమాండ్ కంట్రోల్‌లో ఏర్పాట్లు చేశారు. సునిశిత ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. పాతబస్తీలోని చంద్రాయణ్ గుట్ట, చార్మినార్, అప్జల్ గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్ మీదుగా హుస్సేన్ సాగర్ చేరుకోనున్నాడు బాలాపూర్ గణేషుడు. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర దాదాపు 19 కిలోమీటర్ల మేర సాగనుంది.
గణేషుడి నిమజ్జనం ఈ మార్గాల్లోసాగనుంది..
Also Read:
Minister Harish Rao: త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు
AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం!
Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా