RBI : మార్చి 31న అన్ని బ్యాంకులు పని చేయాల్సిందే... ఆర్బీఐ ఆదేశాలు!

RBI Good News: లోన్స్ తీసుకునే వారికి శుభవార్త చెప్పిన ఆర్బీఐ!
New Update

RBI Orders : మార్చి 31న ప్రభుత్వ పనుల కోసం అన్ని బ్యాంకులు(Banks)  పని(Working) చేయాల్సిందే అని రిజర్వ్‌ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 ఆదివారం కావడంతో పాటు ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆరోజున కచ్చితంగా బ్యాంకులను తెరవాలని ఆర్బీఐ తెలిపింది. ఆ రోజుల ఎన్నో ముఖ్యమైన లావాదేవీలు జరుగుతాయని ఆర్బీఐ వివరించింది. అన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచి ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.

మార్చి 31, 2024 (ఆదివారం) లావాదేవీల(Transactions) కోసం ప్రభుత్వ రశీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 2023-24. ప్రభుత్వ లావాదేవీల ఖాతాలను నిర్వహించడం కోసం, అదే విధంగా, ఏజెన్సీ బ్యాంకులు ప్రభుత్వ వ్యాపారానికి సంబంధించిన అన్ని శాఖలను మార్చి 31, 2024 (ఆదివారం) తెరిచి ఉంచాలని సూచించింది.

అలాగే, మార్చి 31న అన్ని శాఖలు తెరిచి ఉంటాయని ఆర్బీఐ బ్యాంకులకు తెలిపింది. ఈ సమాచారాన్ని వినియోగదారులకు తెలపాలని వివరించింది. RBI ఏజెన్సీ బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, DCB బ్యాంక్ ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ సహా అనేక ఇతర బ్యాంకులు ఈ సేవలు అందించాలని తెలిపింది.

ఇంతకుముందు, పన్ను సంబంధిత పని పెండింగ్‌లో ఉన్నందున ఆదాయపు పన్ను శాఖ మార్చి 29 నుండి మార్చి 31 వరకు వచ్చే లాంగ్ వీకెండ్‌(Long Weekend) ని రద్దు చేసింది. గుడ్ ఫ్రైడే(Good Friday) కారణంగా మార్చి 29, శనివారం మార్చి 30, ఆదివారం మార్చి 31న సెలవులు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ బాకీ ఉన్న పనిని క్లియర్ చేయడానికి మార్చి 29, 30, 31 తేదీలలో అన్ని ఆదాయపు పన్ను కార్యాలయాలు తెరిచి ఉంటాయని ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Also Read : చర్మంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే అధిక కొలెస్ట్రాల్‌ అయి ఉండొచ్చు!

#march-31 #rbi #working #sunday #banks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి