Telangana : భద్రాచలం రాములోరి కల్యాణ వేడుకకు ముమ్మరంగా ఏర్పాట్లు..

శ్రీరామనవమి సందర్భంగా.. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

New Update
Sri Rama Navami Songs :  శ్రీరామ నవమి అనగానే గుర్తుకు వచ్చే 5 సూపర్ హిట్ పాటలివే.. మీరూ వినేయండి!

Bhadrachalam : శ్రీరామనవమి(Sri Rama Navami) సందర్భంగా.. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు(Hanumantha Rao) తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మిథిలా స్టేడియం(Mithila Stadium) లోని ఏర్పాట్లను పరిశీలించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంచినీళ్లు, చలువ పందిళ్లు, అలాగే భక్తులు కళ్యాణ వేడుకలు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్ల ఏర్పాటుతో పాటు ప్రతి సెక్టార్‌లో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కళ్యాణ వేడుకలను వీక్షించేందుకు https://bhadradritemple.telangana.gov.in లో టికెట్లు అందుబాటులో ఉన్నాయని భక్తులు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు.

Also Read: మరో 25 ఏళ్లు బీజేపీనే.. మోదీ సెన్సేషనల్ ఇంటర్వ్యూ లైవ్

Advertisment
తాజా కథనాలు