/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-15T112209.318.jpg)
Rajasthan Kolihan Mine :రాజస్థాన్(Rajasthan)లోని నీమ్ కా థానా జిల్లాలోని ఓ గనిలో చిక్కుకున్న హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ(Hindustan Copper Ltd Company)కి చెందిన 15 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఈరోజు తెల్లవారుజామున వారిని రక్షించామని అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి కోలిహన్ గనిలో ఉద్యోగులను తీసుకెళ్లే వర్టికల్ లిఫ్ట్ మెషిన్ 1800 అడుగుల మేర పడిపోయింది. దీంతో విజిలెన్స్ టీమ్‌తో సహా 15 మంది ఉద్యోగులు లిఫ్ట్‌లో చిక్కుకున్నారు.
Also read: ఒకవేళ అలా చేస్తే అవే నా చివరి ఎన్నికలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఎట్టకేలకు లిఫ్ట్‌లో చిక్కుకున్న 15 మందిని కాపాడాయి. అయితే ఆ గనిలో మొత్తం 150 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. ముందుగా లిఫ్ట్‌లో చిక్కుకున్న అధికారులని కాపాడిన తర్వాత.. మిగతా కార్మికులను కూడా రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 1967లో ఈ ప్రాంతంలో కాపర్ లిమిటెడ్ ద్వారా రాగి తవ్వకాన్ని ప్రారంభించారు. ఇక్కడి నుంచి 24 మిలియన్ టన్నుల ఖనిజాన్ని బయటికి తీశారు. ఈ గనిలో ఇంకా 16 మిలియన్ టన్నుల ఖనిజాన్ని తవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ ప్రమాదం జరగడం ఆందోళన కలిగించింది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్‌ను వేగవంతం చేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ అధికారులను ఆదేశించారు.
Also read: రాజస్థాన్ లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. చేతి వేళ్ళు కట్ చేసి..