Aliens: ఏలియన్స్ ఉండొచ్చు.. ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఎలియన్స్ ఉండి ఉండొచ్చని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ అన్నారు. అవి భూమిపైకి వస్తూ వెళ్తుండొచ్చని పేర్కొన్నారు. భూమిపై కాకుండా వేరే చోట ఎవరైనా మనకన్నా 1000 ఏళ్లు అడ్వాన్స్‌డ్‌గా లేదా 200 ఏళ్లు వెనకబడి ఉండొచ్చని తెలిపారు.

New Update
Aliens: ఏలియన్స్ ఉండొచ్చు.. ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

ఇస్రో ఛైర్మన్ ఎస్‌. సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఎలియన్స్ ఉండి ఉండొచ్చని తెలిపారు. దీనికి సంబంధించి ఓ పోడ్‌క్యాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ' ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది. అవి భూమిపైకి వస్తూ వెళ్తూ ఉండొచ్చు. మనకు తెలియకుండా మనం మాట్లాడుకునే మాటలు వింటుండొచ్చు. ఈ భూమిపై గత వందేళ్లలో సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో ఇంకా అవుతుంది.

Also Read:  ప్రభుత్వాన్ని మోసం చేసిన మంత్రి పొంగులేటి !

భూమిపై కాకుండా వేరే చోట ఎవరైనా మనకన్నా 1000 ఏళ్లు అడ్వాన్స్‌డ్‌గా లేదా 200 ఏళ్లు వెనకబడి ఉండొచ్చని'' సోమనాథ్‌ వివరించారు. ఇదిలాఉండగా ఇప్పటికే ఏలియన్స్‌పై అనేక ఊహాగాణాలు వస్తున్నాయి. ఈ విశ్వంలో ఎక్కడో ఓ చోట ఏలియన్స్ ఉండొచ్చని కొందరు చెబుతుంటే.. మరికొందరు అలాంటి అవకాశం ఉండొదని కొట్టిపారిస్తు్న్నారు.

Also Read: అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు