డీప్ ఫేక్ వీడియోపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అద్భుతాలు చేస్తున్నారంటూ

ఇటీవల వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోపై అలియా భట్ స్పందించారు. రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌కు హాజరైన ఆమె ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు ఎన్ని వచ్చినా మనమంతా ముందుకు సాగాలి. సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలు కనుక్కోవాలన్నారు.

New Update
డీప్ ఫేక్ వీడియోపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అద్భుతాలు చేస్తున్నారంటూ

బాలీవుడ్‌ స్టార్ నటి అలియా భట్‌ ఇటీవల తనకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఇష్యూపై స్పందించారు. అధునాతన సాంకేతికతతో చాలామంది అద్భుతాలు చేస్తుంటే మరికొందరూ దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇతరులకు ఇబ్బంది కలిగే పనులు ఎప్పటికీ చేయకూడదని, అలాంటివారిని కఠినంగా శిక్షించాలన్నారు.

ఈ మేరకు తాజాగా రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌కు హాజరైన ఆమె ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘డీప్‌ ఫేక్‌ గురించి చెప్పడానికి చాలా ఉంది. మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడే చెడు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సమస్యలు ఎన్ని వచ్చినా మనమంతా ముందుకు సాగాలి. మన జీవితాన్ని కొనసాగించాలి. అలాగే, సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలు కూడా కనుక్కోవాలి. అధునాతన సాంకేతికతతో కొందరు అద్భుతాలు చేస్తున్నారు. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిగే పనులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రక్షణ కల్పించేందుకు కచ్చితంగా చట్టాలు వస్తాయని నేను అనుకుంటున్నా’ అని అలియా చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఓ అమ్మాయి బెడ్ రూమ్ లో బోల్డ్ యాంగిల్స్ చూపిస్తూ చేసిన రీల్స్ వైరల్ అయ్యాయి. కాగా ఆ అమ్మాయి బాడీకి అలియా ఫేస్ అతికించి ఆకతాయిలు నెట్టింట రీ పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీ మరోసారి ఉలిక్కిపడింది. ఇక ఇటీవల రష్మిక, కాజోల్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రాల డీప్ ఫేక్‌ వీడియోలు ఆందోళన కలిగించాయి. వీటిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రభుత్వం కూడా డీప్‌ఫేక్‌ వీడియోలకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియాల సంస్థలకు నోటీసులు ఇవ్వడంతోపాటు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

publive-image

ఇది కూడా చదవండి : ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన మేకలు.. అవి చేసిన తప్పేంటంటే

ఇక తొలి సినిమా నుంచి భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్‌ కథానాయికగా ఎదిగిన అలియా.. తన నటనకుగానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. నటనతోనే కాదు నిర్మాతగానూ రాణిస్తున్న ఆమె.. ‘నేను 11వ తరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు నాకు కరణ్‌ జోహార్‌తో మీటింగ్‌ ఉన్నట్లు ఫోన్‌కాల్‌ వచ్చింది. స్కూల్‌లో ఉన్న నేను యూనిఫామ్‌తో కరణ్‌ని కలవడానికి ఆయన ఆఫీస్‌కి వెళ్లాను. అప్పుడు నేను ఎక్కువ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తింటూ చాలా బొద్దుగా ఉండేదాన్ని. నన్ను చూసిన వెంటనే ఆడిషన్‌ ఇవ్వుమని అన్నారు. ఆడిషన్‌ అంటే ఏమిటో తెలియకుండానే లోపలికి వెళ్లి ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. నేను ఆ సినిమాలో నాయికగా ఎంపికయ్యానని కరణ్‌ చెప్పిన ఆ క్షణం నాకు కన్నీళ్లాగలేదు. ఆనందంతో ఒక కప్‌ కేక్‌ తినొచ్చా అని కరణ్‌ అడిగా. ఆ విషయం తెలిసిన మా అమ్మ నేను సినిమాల్లో నటించడానికి కొంచెం సంకోచించినా మా నాన్న మాత్రం అంగీకరించారు’ అంటూ ఫస్ట్ మూవీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' స్వీట్ మొమోరీస్ గుర్తుచేసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు