Navalny: నావల్నీ మృతిపై కీలక అప్‌డేట్‌.. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలు..!

నావల్నీ మరణానికి సంబంధించి మరో కీలక కథనం బయటపడింది. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలున్నాయని ఓ స్థానిక మీడియా చెప్పింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించినట్లు ఓ వైద్య నిపుణుడ్ని ఉటంకిస్తూ పేర్కొంది.

Navalny: నావల్నీ మృతిపై కీలక అప్‌డేట్‌.. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలు..!
New Update

Alexei Navalny Death: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి, విపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణం ఇంకా వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికే అమెరికా, కెనడా, యూకే సహా మరికొన్ని దేశాలు ఆయన మరణానికి పుతిన్ (Vladimir Putin) బాధ్యుడంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. నావల్నీ తల (Head), ఛాతిపై (Chest) కమిలిన గాయాలున్నాయని ఓ స్థానిక మీడియా సంస్థ తెలిపింది. ఆయన మృతదేహాన్ని మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని ఓ వైద్య నిపుణుడ్ని ఉటంకిస్తూ పేర్కొంది.

Also Read: చైనా-పాకిస్తాన్ ల పై టాటా గూఢచారి..మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి.. 

ఏదైన దాస్తున్నారా 

'మామూలుగా జైల్లో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలను గ్లాజ్కోవా విధిలో బ్యూరో ఆఫ్‌ ఫోరెన్సిక్ మెడిసన్‌కు తీసుకెళ్తారు. కానీ ఈ కేసులో మాత్రం కొన్ని కారణాలతో బాడీని క్లినికల్‌ హస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత మార్చురీ లోపలికి తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఇద్దరు పోలీసులు కాపలా ఉన్నారు. ఆయన మృతికి గల కారణం ఏంటో అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ రహస్యం దేనికి.. వారు ఏదైన దాచాలనుకుంటున్నారా అని' వైద్యుడు ప్రశ్నించినట్లు కథనంలో పేర్కొన్నారు.

మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించలేదు

అయితే నావల్నీ (Alexei Navalny) సడెన్‌ డెత్‌ సిండ్రోమ్‌ వల్ల మరణించారని ఆయన తల్లి లియుడ్మిలాకు అధికారులు చెప్పారు. ఆయన మృతదేహాన్ని ఇప్పటికీ కూడా తన కుటుంబానికి అప్పగించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నావల్నీకి నివాళులర్పించేవారిని.. ర్యాలీలు నిర్వహించేవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. మరోవైపు ఆయన్ని హింసించారంటూ వస్తొన్న వార్తలను రష్యా ప్రభుత్వం (Russia Government) ఖండించింది. నావల్నీ సహజ కారణాలు వల్లే చనిపోయారని పేర్కొంది.

Also Read: బార్బీ ప్రేమలో రష్యా అధ్యక్షుడు.. 71 సంవత్సరాల వయసులో మరోసారి ప్రేమలో పడిన పుతిన్‌!

#telugu-news #navalny #alexei-navalny
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి