America Students Visa: అమెరికా వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్ కు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్న భారతీయ విద్యార్థులకు ఆదేశం కొత్త నిబంధనలను విధించింది. వీసా దరఖాస్తు చేసుకునేటప్పుడు పాటించాల్సిన నిబంధనల్లో మార్పులు చేసినట్లు ట్విట్టర్ లో తెలిపింది. అభ్యర్థులు సొంత పాస్ పోర్టు నెంబర్ తో ప్రొఫైల్ రెడీ చేసి పంపించాలని సూచించింది.

USA Tourist Visa:యూఎస్ పర్యాటక వీసాదారులకు గుడ్‌న్యూస్..డ్రాప్ బాక్స్ సదుపాయం
New Update

ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని చాలామంది విద్యార్థులు అనుకుంటారు. అక్కడ చదువు పూర్తిగానే మంచి ఉద్యోగంలో స్థిరపడి అమెరికాలోనే శాశ్వత నివాసం పొందాలని ఆశపడతారు. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్లుగా అన్ని రకాలుగా సిద్ధమవుతారు. ఇలా బారత్ నుంచి ప్రతిఏటా పెద్ద సంఖ్యలు విద్యార్థులు అమెరికాకు పయనమవుతుంటారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం విద్యార్థుల వీసాల కోసం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. m, f, j కేటగిరీ వీసాల కోసం దరఖాస్తుల్లో పలు మార్పులు తీసుకువచ్చింది. ఈ క్రమంలో వీసా నిబంధనల్లో తీసుకువచ్చిన నిబంధనలు గమనించాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

కొత్త నిబంధనలు ఏంటి?

అమెరికా ఎంబసీ తెలిపిన వివరాల ప్రకారం..ఎఫ్, ఎం, జే విద్యార్థి కేటగిరీల క్రింద దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రొఫైల్ ను రూపొందించేటప్పడు వారి వీసా అపాయింట్ మెంట్ షెడ్యూల్ చేసేటప్పుడు వారి స్వంత పాస్ పోర్ట్ సమాచారాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. తప్పుడు పాస్ పోర్ట్ నెంబర్ సమర్పిస్తే దరఖాస్తు తిరస్కరించడంతోపాటు డిపాజిట్ చేసిన డబ్బును కూడా తిరిగి ఇవ్వమని స్పష్టం చేసింది. ఎఫ్,ఎం వీసా కోసం దరఖాస్తు చేసేవాళ్లు ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ స్టూడెంట్ సర్టిఫైడ్ ప్రోగ్రాంలో తప్పనిసరిగా ఎన్ రోల్ చేయాలి. జే వీసాకు దరఖాస్తు చేసుకునేవాళ్లు అమెరికా విదేశాంగశాఖ గుర్తింపు పొందినసంస్థ నుంచి స్పాన్సర్ షిప్ తీసుకుని ఉండాలి. వీసా అపాయింట్ మెంట్ కోసం ఇప్పటికే ప్రొఫైల్ రెడీ చేసుకున్నవారు తమ పాస్ట్ పోర్టు అసలైననెంబర్ తో ఆ దరఖాస్తులను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.

అమెరికా ఎంబసీ 2023లో రికార్డు స్థాయిలో వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు వెల్లడించింది. వీసా బ్యాక్ లాగ్ ను తగ్గించేందుకు తమ దేశం మరింత సిబ్బందిని నియమించడంతోపాటు మరిన్ని కాన్సులేట్ ను ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా అంబాసిడర్ ఎరిక్ తెలిపిన సంగతి తెలిసిందే. 2023 నాటికి కనీసం 1 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుందని గార్సెట్టి తెలిపారు.

పర్సనల్ ఇంటర్వ్యూల అవసరాన్ని తగ్గించి వీసా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి వినూత్న పరిష్కారాలను తీసుకువస్తామని తెలిపారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాన్సులర్ గ్రూపులు పెరుగుతున్న భారతీయ ప్రయాణీకుల కోసం వీసాల ప్రాసెసింగ్ లో సహాయం చేసేందుకు వీలు కల్పిస్తుందని గార్సెట్టి అన్నారు. ఇలా చేయడం వల్ల భారత్ లోని యూఎస్ ఎంబసీ వెయిటింగ్ పీరియడ్ తగ్గనుంది.

#us-visa #america-students-visa #indian-students #united-states-of-america #new-rules #us-embassy #student-visa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe