దీపావళి పండుగ సందర్భంగా సెలవు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12 వ తేదీని దీపావళి సెలవుగా ప్రకటించింది. అయితే ఉద్యోగ సంఘాల విజ్నప్తి మేరకు ఈ తేదీని మార్చుతూ ఈ ప్రకటనను వెలువరించినట్లు సమాచారం. తాజా ఉత్తర్వుల ప్రకారం దీపావళి సెలవును నవంబర్ 13 కు మార్చింది. ఈ మేరకు శుక్రవారం నాడు తాజాగా ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి.
ఇక నవంబర్ 11వ తేదీని రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం, ఆ మరుసటి రోజు సోమవారంతో కలుపుకుని వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈమేరకు సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగులు,సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ సెలువులను అమలు చేయాల్సి ఉంటుందని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా ప్రతిఏటా తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు ఇచ్చే సాధారణ సెలవుల జాబితాను అంతకు ముందు ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ చేసింది. ఆ జాబితా ప్రకారం నవంబర్ 12నే దీపావళి సెలవును ఇచ్చారు. అయితే తాజాగా పండితుల సలహాలు, సూచనల మేరకు సెలవు దినాన్ని మార్చినట్లు ప్రబుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబర్ 13వ తేదీకి మారుస్తూ సర్కార్ ఉత్తర్వులను సవరించింది. దీంతో నవంబర్ 13వ తేదీని ఉద్యోగులతోపాటు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు పాఠశాలలకు కూడా నెగోషియబుల్ చట్టం కింద ఈ సెలవును ప్రభుత్వం ప్రకటించింది.
ఇక ప్రతి ఏటా దీపావళి సెలవును తిధుల ఆధారంగా నిర్ణయిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈసారికూడా ప్రభుత్వంకు వచ్చిన సలహాలు, వినతుల మేరకు ఈ దీపావళి సెలువు దినాన్ని మార్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : దీపావళికి 6 రోజులు బ్యాంకులకు సెలవులు..తేదీలివే..!!