TS Diwali Holiday: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. దీపావళి సెలవు మార్చిన సర్కార్.! దీపావళి పండుగ సెలవుకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సెలవును నవంబర్ 13కు మార్చుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు దీపావళి సెలవును 12గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వరుసగా 3 రోజుల పాటు సెలువులు వచ్చాయి. By Bhoomi 10 Nov 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దీపావళి పండుగ సందర్భంగా సెలవు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12 వ తేదీని దీపావళి సెలవుగా ప్రకటించింది. అయితే ఉద్యోగ సంఘాల విజ్నప్తి మేరకు ఈ తేదీని మార్చుతూ ఈ ప్రకటనను వెలువరించినట్లు సమాచారం. తాజా ఉత్తర్వుల ప్రకారం దీపావళి సెలవును నవంబర్ 13 కు మార్చింది. ఈ మేరకు శుక్రవారం నాడు తాజాగా ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. ఇక నవంబర్ 11వ తేదీని రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం, ఆ మరుసటి రోజు సోమవారంతో కలుపుకుని వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈమేరకు సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగులు,సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ సెలువులను అమలు చేయాల్సి ఉంటుందని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ప్రతిఏటా తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు ఇచ్చే సాధారణ సెలవుల జాబితాను అంతకు ముందు ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ చేసింది. ఆ జాబితా ప్రకారం నవంబర్ 12నే దీపావళి సెలవును ఇచ్చారు. అయితే తాజాగా పండితుల సలహాలు, సూచనల మేరకు సెలవు దినాన్ని మార్చినట్లు ప్రబుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబర్ 13వ తేదీకి మారుస్తూ సర్కార్ ఉత్తర్వులను సవరించింది. దీంతో నవంబర్ 13వ తేదీని ఉద్యోగులతోపాటు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు పాఠశాలలకు కూడా నెగోషియబుల్ చట్టం కింద ఈ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రతి ఏటా దీపావళి సెలవును తిధుల ఆధారంగా నిర్ణయిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈసారికూడా ప్రభుత్వంకు వచ్చిన సలహాలు, వినతుల మేరకు ఈ దీపావళి సెలువు దినాన్ని మార్చినట్లు సమాచారం. ఇది కూడా చదవండి : దీపావళికి 6 రోజులు బ్యాంకులకు సెలవులు..తేదీలివే..!! #school-holidays #diwali #diwali-2023 #ts-diwali-holiday #diwali-holiday #lakshmi-pooja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి