Kannappa: మంచువారి 'కన్నప్ప'లోకి బాలీవుడ్ హీరో ఎంట్రీ.. పోస్ట్ వైరల్!

మంచు విష్ణు తాజా చిత్రం 'కన్నప్ప'నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఎంట్రీతో కన్నప్ప మరింత ఉత్కంఠభరితంగా మారిందనే పోస్ట్ వైరల్ అవుతోంది.

New Update
Kannappa: మంచువారి 'కన్నప్ప'లోకి బాలీవుడ్ హీరో ఎంట్రీ.. పోస్ట్ వైరల్!

Kannappa Movie: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa) నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వెలువడింది. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. వివిధ భాషలకు చెందిన స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. తాజాగా మరో బాలీవుడ్ స్టార్‌ హీరో ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.

మరింత ఉత్కంఠభరితంగా..
ఈ మేరకు అభిమానులతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్న చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ఇందులో భాగం కాబోతున్నట్లు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌కు తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వాగతం పలుకుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన ఎంట్రీతో కన్నప్ప మరింత ఉత్కంఠభరితంగా మారింది. మాకు థ్రిల్‌గా ఉంది. మర్చిపోలేని సాహసానికి సిద్ధంగా ఉండండి’ అంటూ సినిమాపై క్యూరియాసిటే పెంచేసింది.

ఇది కూడా చదవండి: Iran-Israel war: ఇజ్రాయెల్‌ నుంచి RTV ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్టు!

నేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి..
ఇక 1993లో ఓ కన్నడ, 2018లో 'రోబో2.0'తో తమిళ పరిశ్రమకు పరిచయమైన అక్షయ్.. కన్నప్పతో నేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ‘కన్నప్ప’లో అక్షయ్ శివుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. ప్రభాస్‌, నయనతారలు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisment
తాజా కథనాలు