Bollywood Actor Comments Viral : బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు, అభిమానులకు కీలక సూచనలు చేశారు. ఈ యేడాది నుంచి ఆరోగ్యవంతమైన జీవితం గడపడంపై ప్రతిఒక్కరూ దృష్టిసారించాలని సూచించారు. అంతేకాదు వెండి తెరపై నటీనటుల ఫిట్ నెస్ చూసి ఎవరూ మోసపోవద్దన్నారు. ఈ మేరకు ఆదివారం మన్ కీ బాత్(Mann Ki Baat) లో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Thank you @narendramodi Sir for making me a small part of your #MannKiBaat…hope your message of good health for all goes far and wide 🙏 https://t.co/JwYs5mw2G8
— Akshay Kumar (@akshaykumar) December 31, 2023
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు(Celebrities), యువకులు. అయితే అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సహజ మార్గాల్లోనే ఫిట్‌గా ఉండటానికి ప్రాధాన్యతనివ్వాలి. నేను అలాగే చేస్తా. అత్యాధునిక జిమ్‌లకు వెళ్లడం కంటే.. ఈత కొట్టడం, బ్యాడ్మింటన్ ఆడటం, మెట్లు ఎక్కడం, తదితర మార్గల్లో వ్యాయామం చేయడం వైపే మొగ్గుచూపుతుంటాను. అంతేకాదు ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. నేను అదే ఫాలో అవుతా. మీరు మీ వైద్యుల సూచనల మేరకు లైఫ్ స్టైల్ ను మార్చుకోండి. అంతేగానీ సినీనటులను ఫాలో కావడం సరైనది కాదు. చాలాసార్లు నటులు తెరపై కనిపించినట్లుగా బయట ఉండరు. వారిని చూపించడానికి స్పెషల్ ఎఫెక్ట్స్ వాడుతుంటారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ దేహాలను పొందాలన్న కోరికతో చాలామంది ఇప్పుడు వాడుతున్నారు. కానీ అలాంటి షార్ట్‌కట్ మార్గాల వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతాయని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి : David Warner : వార్నర్ ఫ్యాన్స్ కు షాక్.. న్యూ ఇయర్ రోజే డేవిడ్ సంచలన నిర్ణయం
అలాగే ఫిట్‌నెస్‌ను భక్తితో పోల్చిన అక్షయ్.. 'ఫిట్‌నెస్ ఇన్‌స్టంట్ కాఫీ లేదా రెండు నిమిషాల నూడుల్స్ లాగా ఉండకూడదు. ఈ కొత్త సంవత్సరంలో రసాయనాలు, షార్ట్‌కట్, వ్యాయామం, యోగా, మంచి ఆహారం, సమయానికి నిద్రపోవడం వంటివాటిపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా ధ్యానం చేయండి. 'ఫిల్టర్ జీవితాన్ని గడపకండి. ఫిట్టర్ జీవితాన్ని గడపండి' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.