శ్రీకాకుళంలో నాగచైతన్య.. మత్స్యకారుడి జీవితం ఆధారంగా సినిమా

New Update
శ్రీకాకుళంలో నాగచైతన్య.. మత్స్యకారుడి జీవితం ఆధారంగా సినిమా

Akkineni Naga Chaitanya at Srikakulam : 'కస్టడీ' సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అక్కినేని నాగచైతన్య. దీంతో నెక్ట్స్ తాను చేసే మూవీపై మంచి ఫోకస్ పెట్టారు. అందులోనూ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. గతంలో తనతో 'ప్రేమమ్, సవ్యసాచి' చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ చందూ మొండేటితో చైతన్య మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయింది. ఈ చిత్రం ఓ మత్స్యకారుడి నిజ జీవితం ఆధారంగా చేయబోతున్నారట. ఈ సినిమాలో చైతన్య మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు.

ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ బన్నీ వాసు, చైతన్య అండ్ చందూ మొండేటి శ్రీకాకుళంలోని గార మండలం కే మచ్చిలేశం గ్రామంలో పర్యటించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి జీవన విధానం, స్థితి గతులను పరిశీలించడానికి చైతన్య అండ్ టీమ్ అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. ఈ సినిమా కోసం నాగచైతన్య హోమ్ వర్క్ కూడా చేస్తున్నాడట. ఇటీవల పాండిచ్చేరిలోని ఆదిశక్తి యాక్టింగ్ అకాడమీకి వెళ్లి యాక్టింగ్ లో మరిన్ని మెలకువలు నేర్చుకొని వచ్చాడు చైతన్య.

Akkineni Naga Chaitanya and Director Chandoo Producer Bunny Vas visits Srikakulam

అనంతరం నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం చందూ ఈ కథ చెప్పాడు. యదార్థ సంఘటనల ఆధారంగా కథను డెవలప్ చేశారు. వాస్, చందూ రెండేళ్లుగా కథపై వర్క్ చేస్తున్నారు. మత్స్యకారుల జీవనశైలి, వారి బాడీ లాంగ్వేజ్, గ్రామ వాతావరణాన్ని పూర్తి అర్థం చేసుకోవడానికి ఇక్కడి వచ్చామన్నారు.

నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) మాట్లాడుతూ.. మా పని ఇప్పుడే మొదలైంది. 2018లో ఓ సంఘటన జరిగింది. గ్రామంలోని స్థానికులు ఉపాధి కోసం గుజరాత్(Gujarat) కు వెళ్లి అక్కడ ఫిషింగ్ బోట్లలో పని చేస్తున్నారు. ఆ తర్వాత 2018లో గుజరాత్ విరావల్ నుండి వేటకెళ్లిన 21 మంది మత్స్య కారులు అనుకోకుండా పాక్ కోస్ట్ గార్డ్ కి చిక్కారు. అక్కడ వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటో.. అనేది చందూ ఎంతో చక్కగా డెవలప్ చేశాడు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా నిర్మాతలు కొన్ని రియలిస్టిక్ సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. డైరెక్టర్ చందూ కూడా ఆ మూలాల్లోకే వెళ్లాలనుకుంటున్నాడు. యాథర్థ ఘటనకు లవ్ అండ్ ఎమోషన్స్,, యాక్షన్ ను జోడించి బలమైన కథగా మార్చినట్టు తెలిపారు. భారీ స్థాయిలో రూపొందించనున్నామని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు.

ఇక ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్ అని పిలుస్తారట. స్థానికంగా పాపులర్ అయిన ఈ పదాన్నే టైటిల్ గా ఫైనల్ చేశారని సమాచారం. స్టోరీ పరంగా చూస్తే.. కొన్ని సీన్లు శ్రీకాకుళంతో పాటు గుజరాత్ లో, మరికొన్ని సీన్లు పాకిస్తాన్ బార్డర్లో సాగుతాయని సమాచారం అందుతోంది.

Also Read: ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ – భోళాశంకర్ , గాండీవధారి అర్జున , ఆదికేశవ

Advertisment
Advertisment
తాజా కథనాలు