Airtel : ఎయిర్ టెల్, వోడాఫోన్ మొబైల్ యూజర్స్ కు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్!

ఎయిర్‌టెల్, వొడఫోన్ టెలికాం సంస్థలు రీచార్జ్ ప్లాన్స్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది. భార‌తీ ఎయిర్‌టెల్ సైతం టారిఫ్‌ల‌ను పెంచేసింది. జూలై 3వ తేదీ నుంచి కొత్త టారిఫ్‌లు అమ‌లులోకి రానున్నాయి. అన్‌లిమిటెడ్ వాయిస్, డెయిలీ డేటా, డేటా యాడ్ ప్లాన్స్ కేట‌గిరీల్లో కొత్త ధ‌ర‌లు అమలులోకి రానున్నాయి.

New Update
Airtel : ఎయిర్ టెల్, వోడాఫోన్ మొబైల్ యూజర్స్ కు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్!

Airtel, Vodafone Idea Also Increase Thier Tarrifs : రిలయన్స్ జియో నిన్న యూజర్స్ కు షాక్ ఇస్తూ రీఛార్జ్ ప్లాన్స్ పెంచిన విషయం తెలిసిందే.ఈ మేరకు జూలై 3 నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అమలులోకి వస్తాయని చెప్పింది. ఇప్పుడు ఇదే దారిలో ఎయిర్‌టెల్, వొడఫోన్ నడిచేందుకు సిద్ధమైనట్లు సమచారం. త్వరలో ఈ రెండు టెలికాం సంస్థలు కూడా తమ రీచార్జ్ ప్లాన్స్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది. తాజాగా భార‌తీ ఎయిర్‌టెల్ సైతం టారిఫ్‌ల‌ను పెంచేసింది.

మొబైల్ ఫోన్ల‌కు చెందిన కొత్త ప్యాకేజీ రెట్ల‌ను ఆ సంస్థ రిలీజ్ చేసింది. అన్ని స‌ర్కిళ్ల‌లోనూ ఒకేర‌క‌మైన టారిఫ్ ఉంటుంద‌ని ఎయిర్‌టెస్ సంస్థ పేర్కొన్న‌ది. జూలై 3వ తేదీ నుంచి ఈ ఎయిర్‌టెల్ కొత్త టారిఫ్‌లు అమ‌లులోకి రానున్నాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్‌, డెయిలీ డేటా ప్లాన్స్‌, డేటా యాడ్ ఆన్స్‌, పోస్టుపెయిడ్ ప్లాన్స్ కేట‌గిరీల్లో కొత్త ధ‌ర‌లు అమలులోకి రానున్నాయి. ప్ర‌తి మొబైల్ యూజ‌ర్‌పైన స‌గ‌టున రూ.300 పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భార‌తీ ఎయిర్‌టెల్ అభిప్రాయ‌ప‌డింది.

అన్ని ప్లాన్ల‌పై స‌గ‌టున రోజుకు రూ.70 పైస‌లు చొప్పున పెంచినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. టెలికాం పరిశ్రమలో చివరిసారిగా 2021 డిసెంబర్ లో 20 శాతం టారిఫ్ పెంపు జరిగింది. అంతకుముందు 2019లో టారిఫ్‌లను పెంచాయి. జియో 2016లో సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారి టారిఫ్లను పెంచింది. 2019 పెంపు సుంకాన్ని 20-40% పెంచింది, 2021 పెంపు 20% పెరిగింది. 2021లో జియోతో పాటూ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో మొబైల్ సర్వీస్ రేట్లను పెంచింది. ఎయిర్‌టెల్ ఎంట్రీ-లెవల్ మొబైల్ సేవల ప్లాన్‌ను 2023 ప్రారంభంలో రూ.99 నుండి రూ.155కి దాదాపు 56 శాతం పెంచింది.

publive-image

ఎయిర్ టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..

ప్రీపెయిడ్‌ ప్లాన్లు..

రూ.199 ప్లాన్: గతంలో రూ. 179 ధర ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు రూ.199. ఇందులో 2GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, 100 SMSలు 28 రోజుల పాటూ

రూ.299 ప్లాన్: ఇంతకుముందు రూ. 265.. ఇప్పుడు రూ.299. 1GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు 28 రోజులు.

రూ.349 ప్లాన్: గతంలో రూ. 299, ఇప్పుడు రూ.349. ఇందులో రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, 100 SMSలు 28 రోజులు

రూ.409 ప్లాన్: ఇంతకుముందు రూ. 359, ఇప్పుడు రూ.409. ఇది రోజుకు 2.5GB డేటా, అన్ లిమిటెడ్, రోజుకు 100 SMSలను 28 రోజుల పాటు.

రూ.449 ప్లాన్: గతంలో రూ. 399, ఇప్పుడు రూ.449. ఇందులో రోజుకు 3GB డేటా, అన్ లిమిటెడ్, 100 SMSలు 28 రోజుల పాటు ఉంటాయి.

రూ.509 ప్లాన్: ఇంతకుముందు రూ. 455, ఇప్పుడు రూ.509. ఇది 6GB డేటా,అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల పాటు..

Advertisment
Advertisment
తాజా కథనాలు