Microsoft Windows Crash : శుక్రవారం మధ్యాహ్నం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ (Microsoft Cloud) సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్ (India) తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టులు, హెల్త్, స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, తదితర సేవలు స్తంభించిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోదారులకు వారి సిస్టమ్స్, ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. దీంతో యూజర్లు తమ సమస్యలను ఎక్స్ వేదికగా తెలియజేశారు. అయితే విండోస్‌లో తలెత్తిన సమస్యలపై మైక్రోసాఫ్ట్ స్పందించిం. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసుల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తున్నామంటూ పోస్టు చేసింది. తాము చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Microsoft Outage : మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్.. బిలియన్ల డాలర్లు నష్టం
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో భారీ నష్టం వాటిల్లింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ 'క్రౌడ్‌స్ట్రైక్' కంపెనీ షేర్లలో 16 బిలియన్ల డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా 1300లకు పైగా విమానాల సర్వీసులు రద్దయ్యాయి.
Translate this News: