Microsoft Outage : మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ క్రాష్‌.. బిలియన్ల డాలర్లు నష్టం

మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ సేవల్లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో భారీ నష్టం వాటిల్లింది. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ 'క్రౌడ్‌స్ట్రైక్‌' కంపెనీ షేర్లలో 16 బిలియన్ల డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా 1300లకు పైగా విమానాల సర్వీసులు రద్దయ్యాయి. 

New Update
Microsoft Outage : మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ క్రాష్‌.. బిలియన్ల డాలర్లు నష్టం

Microsoft Windows Crash : శుక్రవారం మధ్యాహ్నం మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ (Microsoft Cloud) సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్‌ (India) తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టులు, హెల్త్, స్టాక్‌ మార్కెట్, బ్యాంకింగ్‌, తదితర సేవలు స్తంభించిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోదారులకు వారి సిస్టమ్స్‌, ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్రీన్ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ కనిపించింది. దీంతో యూజర్లు తమ సమస్యలను ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. అయితే విండోస్‌లో తలెత్తిన సమస్యలపై మైక్రోసాఫ్ట్ స్పందించిం. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్‌, సర్వీసుల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తున్నామంటూ పోస్టు చేసింది. తాము చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని పేర్కొంది.

Also read: మనుషుల ఆయుష్షు పెంచే ప్రయోగం సక్సెస్‌..

మైక్రోసాఫ్ట్‌ సేవలు నిలిచిపోవడంతో సైబర్‌ సెక్యూరిటీ సంస్థ 'క్రౌడ్‌స్ట్రైక్‌' (Cloud Strike) కంపెనీ షేర్లు 21 శాతం పడిపోయాయి. దీంతో ఈ కంపెనీకి 16 బిలియన్ల డాలర్లు నష్టం వచ్చి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1300లకు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇంకా అనేక విమనాలు ఆలస్యమయ్యాయి. భారత్‌లో అనేక ఎయిర్‌పోర్ట్‌లలో ఆన్‌లైన్‌ల సేవలు తాత్కలికంగా నిలిచిపోయాయి. బుకింగ్, చెక్-ఇన్‌ సేవల నిర్వహణతో సహా ఆన్‌లైన్ సేవలు ఆగిపోయాయి. స్టాక్ మార్కెట్‌ (Stock Market) తో పాటు ఇతర మార్కెట్లపైనా పడింది. ఆయా మార్కెట్లు డౌన్ అయినట్లు నిపుణులు తెలిపారు. అంతర్జాతీయంగా మీడియా, టెలికాం, విమాన, బ్యాంకింగ్ సేవలపై తీవ్రంగా ప్రభావం పడ్డట్లు పేర్కొన్నారు.ఇక యూకేలోని ప్రముఖ న్యూస్ ఛానల్‌ 'స్కైన్యూస్‌' వార్తలను ప్రసారం చేయడంతో అవాంతరాలు ఎదుర్కొంది. ఆస్ట్రేలియాలో కూడా పలు వార్తా సంస్థల ప్రసారాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పలు సూపర్‌ మార్కెట్‌ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడిది.

కొన్ని దేశాల్లో ఆన్‌లైన్‌తో అనుసంధానమై ఉన్న పోలీసుల వ్యవస్థలు క్రాష్‌ అయ్యాయి. ఇక లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో కూడా సమస్యలు వచ్చాయి. అక్కడ మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అమెరికాలోని ఫెడరల్ ఏవయేషన్‌ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు సైతం దెబ్బతిన్నాయి. అలాగే అమెరికాలో అత్యవసర సర్వీసులు అందించే '911' సేవల్లో కూడా సమస్యలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్‌లోని ఎన్ఏబీ, కామన్వెల్త్, బెండిగోతో పాటు తదితర బ్యాంకులు సైతం ఆఫ్ లైన్ మోడ్ లోకి వెళ్లాయి. అలాగే దక్షిణాఫ్రికా అతిపెద్ద బ్యాంకు అయిన కాపిటెక్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. అజూర్ సేవలతో పాటు మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్లలో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఈ సమస్యలను క్రమంగా పరిష్కరిస్తున్నామని స్పష్టం చేసింది.

మైక్రోసాఫ్ట్‌ అంతరాయం ప్రభావంతో భారత్‌కు చెందిన 200లకు పైగా విమానాలు రద్దు అయ్యాయి. ఒక్క ఇండిగో ఎయిర్‌లైన్స్‌ భారత్‌తో పాటు వివిధ దేశాల్లో దాదాపు 200 విమానాలను రద్దు చేసింది. అలాగే అమెరికాలో ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ రెండు గంటలకు పైగా విమానాల సేవStock లు ఆగిపోయాయి. ఈ అంతరాయం రిజర్వేషన్లు, బుకింగ్స్ పై కూడా ఎఫెక్ట్‌ చూపింది. అమెరికాకు చెందిన అలెజియంట్ ఎయిర్‌లైన్స్‌ కూడా రిజర్వేషన్లు, బుకింగ్‌లలో సాంకేతిక సమస్య తలెత్తింది. సన్ కంట్రీ ఎయిర్ లైన్స్ సేవలకు కూడా ఆగిపోయాయి.

మరోవైపు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా దీనిపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం.. మైక్రోసాప్ట్‌తో నిరంతరం టచ్‌లో ఉందని తెలిపారు. ఈ సాంకేతిక సమస్యకు గల కారణాలను గుర్తించినట్లు ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. వీటి పరిష్కారానికి అప్‌డేట్‌లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌ సెంటర్‌(NIC) నెట్‌వర్క్‌ ఎలాంటి ప్రభావానికి గురికాలేదన్నారు. ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT) సాంకేతిక సలహాలను జారీ చేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ అంతరాయంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలో విమాన సేవల్లో జాప్యం జరుగుతోందని పౌరవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా విమానశ్రయాల్లో అదనపు సీట్లు, మంచినీటి వసతి, ఆహారం సమకూర్చాలని ఎయిర్‌పోర్టు అధికారులు, ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. 



Advertisment
తాజా కథనాలు