ఢిల్లీలోని విమానశ్రయంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం కలకలం రేపుతోంది. 30 ఏళ్ల వయసున్న అతడు గుండెపోటుతో మృతి చెందాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం హిమ్మానీల్ కుమార్ అనే వ్యక్తి విమానాశ్రయంలో టెర్మినల్ 3 లోని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ విభాగంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే ఉన్నట్లుండి అతనికి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో అతడు కింద పడిపోయాడు. అయితే ఇది గమనించిన అతని సహోద్యోగులు సీపీఆర్ చేశారు.
Also read: ద్రవ్యోల్బణం కాస్త ఉపశమనం కలగించింది.. కానీ.. : ఆర్బీఐ
ఆ తర్వాత విమానశ్రయంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. సీనియర్ కమాండర్ పైలట్ అయిన హిమ్మనీల్ కుమార్.. బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేసేందుకు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 23న అతనికి వైద్య పరీక్షల్లో నిర్వహించారని. అయితే అందులో ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నట్లు తేలినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఆయన ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో ఎయిర్ ఇండియా సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోందని చెబుతున్నారు. అలాగే బాధితుడు కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని అధికారులు వెల్లడించారు.
Also Read: అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాయిస్‌తో రూ.1.4 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..