Hamas Israel War: హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత సంవత్సరం అక్టోబర్ 7 నుండి యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణించిన తరువాత ఈ యుద్ధం ఊహించని విధంగా అంతకంతకూ పెరిగింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని భారత విమానం ఎయిరిండియా రద్దు చేసింది. ఆపరేషనల్ కారణాలతో ఎయిర్ ఇండియా గురువారం రాజధాని నుండి టెల్ అవీవ్‌కు తన విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా, భద్రత విషయమై ఈ చర్య తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రస్తుతానికి విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది.
ఎయిర్ ఇండియా ప్రతి వారం ఢిల్లీ నుండి టెల్ అవీవ్ కు నాలుగు విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. తన వెబ్‌సైట్‌లో టెల్ అవీవ్‌కు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆపరేషనల్ కారణాల వల్ల, ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కి తన ఫ్లైట్ AI139, ఆగస్టు 1న టెల్ అవీవ్ నుండి ఢిల్లీకి AI140 విమానాన్ని రద్దు చేసినట్లు పేర్కొంది. ఈ రెండు విమానాల్లో ప్రయాణించడానికి ధృవీకరించిన బుకింగ్‌లు ఉన్న ప్రయాణికులకు వారి టిక్కెట్ డబ్బు తిరిగి చెల్లించడం జరుగుతుందని ఎయిర్ ఇండియా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Also read: 15 వేల మందిని తొలగించేందుకు రెడీ అయిన ప్రముఖ టెక్ కంపెనీ!