Air India: తెలుగులో ఎయిర్ ఇండియా కస్టమర్ సర్వీస్

ప్రయాణికులకు మెరుగై సేవలు అందించే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్ సర్వీస్‌ను ఇంగ్లీషు, హిందీలతో పాటూ ఏడు ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలని డిసైడ్ అయింది. ఇందులో తెలుగును కూడా ఐవీఆర్ సిస్టమ్‌లో జోడించింది.

New Update
DGCA: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్‌ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్‌ ఇండియాకు భారీ జరిమానా

Seven Local Languages: ఎయిర్ ఇండియా సేవలు ఇక మీదట తెలుగులో కూడా మొదలవనున్నాయి. ఇప్పటివరకు కస్టమర్ సేవలను ఇంగ్లీషు, తెలుగుల్లోనే చేస్తున్న ఎయిర్ ఇండియా ఇక మీదట మరో ఏడు భారత ప్రాంతీయ భాషల్లో కూడా అందించనుంది. ఇందులో తెలుగు కూడా ఒకటి కావడం విశేషం. తెలుగు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కస్టమర్ సర్వీసును తెలుగు భాషలో కూడా అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

కొత్త ప్రవేశపెట్టిన ఏడు భాషలలో తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళం ఉన్నాయి. వీటిని తమ ఐవీఆర్ సిస్టమ్స్‌లో అప్‌ డేట్ చేసింది. ఈ సర్వీస్ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలిపింది. దాంతో పాటూ కొత్తగా ఐదు కొత్త కాంటాక్ట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన సమాచారం కోసం ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.

Also Read: Karnataka: బళ్ళారి జైలుకు కన్నడ నటుడు దర్శన్ తరలింపు

Advertisment
తాజా కథనాలు