Fighter: ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్‌లో ముద్దులు.. హృతిక్-దీపికల సినిమాకు లీగల్ నోటీసులు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా వచ్చిన రీసెంట్ మూవీ ‘ఫైటర్’ చిక్కుల్లో పడింది. ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్‌లో ముద్దు సన్నివేశాలపై వాయుసేన అధికారి సౌమ్య దీప్‌దాస్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. By srinivas 06 Feb 2024 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి Legal Notice For Fighter Movie: బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్ (Hrithik Roshan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా వచ్చిన రీసెంట్ మూవీ ‘ఫైటర్’ (Fighter) చిక్కుల్లో పడింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ సీన్స్ విమర్శలకు దారితీస్తున్నాయి. అంతేకాదు ఇందులోని ఓ సన్నివేశంపై ఎయిర్‌ఫోర్స్ అధికారులు (Air Force) చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది. ముద్దు సన్నివేశం.. ఈ మేరకు అస్సాంకు చెందిన వాయుసేన అధికారి సౌమ్య దీప్‌దాస్ (Soumyadeep Das).. ఇందులోని ముద్దు సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ సన్నివేశంలో హీరో, హీరోయిన్ ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్‌లో ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనిఫాంలో అలాంటి సీన్స్ చేయడమంటే.. దాన్ని అవమానించినట్లేనని ఆరోపించారు. దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందోననే అంశం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి : Tamil Nadu: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన రజనీకాంత్.. ఏమన్నారంటే విమాన పైలట్లుగా.. ఇక ఇండియన్ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇందులో హృతిక్, దీపికలు యుద్ధ విమాన పైలట్లుగా కనిపించారు. ఈ సినిమా విజయంపై ఆనందం వ్యక్తంచేసిన హృతిక్ రోషన్ దీనికోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ‘ఇందులో నా లుక్ కోసం కఠోరంగా శ్రమించా. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా. ఏడాదిపాటు స్నేహితులను కూడా కలవలేదు. త్వరగా నిద్రపోయేవాడిని. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవాడిని’ అని చెప్పారు. #fighter #deepika-padukone #hrithik-roshan #air-force #leagle-notices మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి