Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party) దూకుడు పెంచింది. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఇవాళో రేపో సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేయనుంది. ఇక ప్రచార పర్వంలోనూ స్పీడ్ పెంచింది కాంగ్రెస్. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ పర్యటన తేదీలు ఫిక్స్ అయ్యాయి. అక్టోబర్ 28న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణకు వస్తుండగా.. ఆదివారం నాడు అంటే అక్టోబర్ 29న తెలంగాణకు రానున్నారు మల్లిఖార్జున ఖర్గే. వీరిద్దరూ కలిసి తెలంగాణలో పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వీరి షెడ్యూల్ వివరాలను ప్రకటించింది.
ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!
ఈ షెడ్యూల్ ప్రకారం.. శనివారం నాడు తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలలో డీకే శివకుమార్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు తాండూరులో, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిగిలో, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు చేవెళ్లలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక ఆదివారం నాడు మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తాండూరు, పరిగి, చేవళ్లలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. మెదక్ పార్లమెంట్ పరిధిలో సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. పాదయాత్ర, కార్నర్ మీటింగ్, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..