కొంపముంచిన రీల్ వీడియో.. కటకటాల్లోకి తల్లీకూతుళ్లు.. సోషల్ మీడియా మోజులో పడి చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తూ చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలన్న ఆశతో డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు. ఇక యువత అయితే రీల్స్‌తో తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో నిషేధ ప్రదేశాల్లోనూ రీల్స్ చేస్తూ జైలు పాలయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. By Shareef Pasha 24 Jul 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ప్రమాదకరమైన రీల్స్ చేయొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్న చాలామంది రీల్స్ చేసేవారు వాటన్నింటిని లైట్ తీసుకుంటున్నారు. తాజాగా.. అలాంటి ఘటనే ఆగ్రాలో జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఓ తల్లీ కూతుళ్ల రైల్ రీల్ స్టోరీ ఆఖరికి కటకటాల వెనక్కి నెట్టేసింది. తల్లి డ్యాన్స్ చేస్తుండగా.. కూతురు మొబైల్‌లో వీడియోను రికార్డు చేసింది. చేస్తే చేసింది గానీ.. ఆ రీల్‌ని ఏ గట్టు వెంబడో.. ఏ చెరువు వెంబడో చేస్తే బాగుండేది. అలా చేస్తే ప్రపంచం గుర్తించదు అనుకున్నదో ఏమో.. ఏకంగా రైల్వే స్టేషన్‌ని ఎంచుకుంది. రైల్వే ట్రాక్ పై తన రీల్‌ని తల్లి స్టార్ట్ చేసింది కూతురు రికార్డు చేసింది. आगरा में रेलवे ट्रेक पर प्लेटफार्म पर मां बेटी ठुमके लगा रही थी । माँ बेटी ने बीच रेलवे ट्रेक पर बनाई थी रील,आरपीएफ ने मां बेटी को पकड़ा और हवालात की कार्यवाही जारी है@RPF_INDIA @spgrpagra @DeepikaBhardwaj @Uppolice pic.twitter.com/jsi6b6fqoy— Madan Mohan Soni (@madanjournalist) July 23, 2023 ట్రాక్‌పై స్టెప్పులు వేస్తూ.. 'అబ్ తేరే బిన్ హమ్ భీ జీ లేంగే' అనే సాంగ్‌కు ట్రాక్‌పై స్టెప్పులు వేస్తూ ఉంటే.. కూతురు మాత్రం ఎంచక్కా.. చాలా జాగ్రత్తగా ఆ వీడియోను తన మొబైల్‌లో రికార్డు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ కావడంతో.. నెటిజన్స్ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరడంతో పోలీసులు సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రైల్వే చట్టం 145, 147 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తల్లీకూతుళ్లు కటకటాల పాలు.. రీల్ షూటింగ్‌లో సహకరించిన ఆమె కుమార్తెను ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. వీరిద్దరూ మరోసారి ఇలాంటివి పునరావృతం చేయమని హామీ ఇవ్వడంతో వారిని బెయిల్ పై విడుదల చేశారు. ఈ ఘటన ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దేశంలో రైల్వే ప్రాంగణాల్లో షూటింగ్ చేయాలంటే సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అయితే రైలు పట్టాలు, రైలు పైకప్పులు వంటి ప్రాణాంతక ప్రదేశాలలో చిత్రీకరణ పూర్తిగా నిషేధించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. #police #viral #crime #agra #reels మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి