Telangana:నిరుద్యోగులకు గుడ్ న్యూస్...ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు

ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి పెంచింది.

New Update
Telangana: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..

Age Limit Extended:ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి పెంచింది.

Also Read:Telangana : రేపు కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలి…

రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. 32 లక్షల మంది నిరుద్యోగుల్లో విశ్వాసం నింపేందుకు తమ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుందని సీఎం అన్నారు. పోలీస్ ఉద్యోగాలతో పాటూ, సింగరేణి, 64 కొత్త ఖాళీలతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. సింగరేణిలో 80 వాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇక 15 వేల పోలీస్ ఉద్యోగాల గురించి కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

కానిస్టేబుల్ నియామక పత్రాలు

దీంతో పాటూ ఇప్పటికే పోలీస్ ఉద్యోగాలకు ఎపంఇకైన అభ్యర్ధులకు నియామక పత్రాలు కూడా అందిస్తామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 19 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించనున్నట్లు సమాచారం. పీటీసీలో మౌలిక వసతుల కల్పన, ఇండోర్, అవుట్ డోర్ శిక్షణ మీద డీజీపీ రవిగుప్తా అధికారులతో ఇప్పటికే రివ్యూ చేశారు. మొత్తం 15,644 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు