WhatsApp status: శ్రీకాకుళం జిల్లాకు చెందిన పేదాడ రామకృష్ణ ఫిల్మ్‌నగర్ పటేల్ నగర్లో నివాసముంటూ కారు డ్రైవర్, మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడిన అతడు డబ్బుల కోసం చోరీలు చేయడం మొదలు పెట్టాడు. గతంలో అతడు జూబ్లీహిల్స్ రోడ్ నం. 78లోని ఫీనిక్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న శ్రీహర్ష అనే వ్యాపారి వద్ద కారు డ్రైవర్ గా పని చేశాడు. ఆ సమయంలో యాజమాని కొత్తగా కొన్న ఫ్లాట్ ఇంటీరియర్ పనులను పర్యవేక్షించమని రామకృష్ణకు చెప్పాడు. బిల్డర్ మేనేజర్ రామకృష్ణకు 3 సెట్ల ఫ్లాట్ తాళం చెవులు ఇచ్చాడు. అందులో నుంచి ఒక సెట్ కాజేశాడు రామకృష్ణ. కాజేసి తన వద్దనే ఉంచుకున్నాడు. ఎలాగైనా శ్రీహర్ష ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న నిందితుడు.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత అతడు అనుకున్న సమయం రానే వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 5న శ్రీహర్ష తన కుటుంబ సభ్యులతో కలిసి మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌కు వెళ్లినట్టు వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్నాడు నిందితుడు.
పూర్తిగా చదవండి..Telangana Crime: వాట్సాప్ స్టేటస్ పెట్టాడు..45 లక్షలు గోవిందా..జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
యజమాని తన కుటుంబంతో కలిసి ఫామ్ హౌజ్ వెళ్లినట్లు వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్న మాజీ కారు డ్రైవర్, మేనేజర్ .. అతడి ఇంట్లోకి ప్రవేశించి రూ.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.
Translate this News: