Mobile Alert: శాంసంగ్, ఆపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్

శాంసంగ్, ఆపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. వీటిల్లో సెక్యూరిటీ లోపాలున్నాయని...వెంటనే ఫోన్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. దీనివల్ల వ్యక్తిగత డేటాను హ్యకర్లు దొంగిలించే ప్రమాదముందని చెబుతోంది కేంద్ర కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.

New Update
Mobile Alert: శాంసంగ్, ఆపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్

ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పని చేసే శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్ల లో భద్రతా పరమైన సమస్య ఉన్నట్లు గుర్తించింది కేంద్ర ఐటీ శాఖ. దీని వల్ల వ్యక్తులకు తెలియకుండానే వారి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందుకే వెంటనే తమ శాంసంగ్ స్మార్ట్‌ ఫోన్‌ లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్డేట్‌ చేసుకోవాలని రెండు రోజుల క్రితం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్‌ ఇన్‌ సూచించింది. తాజాగా ఇదే వార్నింగ్ ను ఆపిల్ యూజర్లకూ ఇచ్చింది కేంద్ర ఐటీ శాఖ. ఆపిల్ ప్రోడెక్ట్స్ అయిన ఫోన్లు, ఐపాడ్స్, ల్యాప్ టాప్స్ అన్నింటినీ అప్ డేట్ చేసుకోమని చెబుతోంది.

Also read:ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున బందీలను చంపేసింది-ప్రధాని నెతన్యాహు

శాంసంగ్ , ఆపిల్ ఫోన్లలో నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఏఆర్‌ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిదిద్దకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందని చెబుతోంది కేంద్ర కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. వీటి వల్ల హ్యకర్లుఈజీగా పర్శనల్ డేటాను సేకరిస్తారని హెచ్చరిస్తోంది. సిస్టమ్‌ టైమ్‌ను మార్చి నాక్స్‌ గార్డ్‌ లాక్‌ను బైపాస్‌ చేయగలరని, అర్బిట్రరీ ఫైల్స్‌, సున్నితమైన సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని వివరిస్తోంది.శాంసంగ్‌ ప్రాడెక్ట్స్ అయిన గెలాక్సీ ఎస్‌ 23, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 5 సహా ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌ తో పని చేసే మొబైల్స్‌లో ఈ లోపం ఉన్నట్లు సెర్ట్‌- ఇన్‌ గుర్తించింది. ఈ ఫోన్లు ఉన్నవారు వెంటనే తమ ఫోన్‌ సెట్టింగ్స్‌ లోని అబౌట్‌ డివైజ్‌లోకి వెళ్ళి లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఫోన్‌ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకోవాలని టెక్‌ నిపుణులు సైతం సూచిస్తున్నారు.

ఇప్పుడు ఆపిల్ ప్రాడెక్ట్స్ లో కూడా ఇదే తరమా సెక్యూరిటీ రీజన్స్ బయటపడుతున్నాయని...అందులో కూడా లోపాలు ఉన్నందువల్ల ఈ ఫోన్లను కూడా ఈజీగా హ్యాక్ చేయొచ్చని చెబుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు