Kolkata : కోల్‌కత్తా అత్యాచారం సంఘటనలో వెలుగులోకి నమ్మలేని నిజాలు

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు రేగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు. ట్రైనీ డాక్టర్‌‌ను మొదట హత్య చేసి తరువాత నిందితుడు రేప్ చేశాడని పోలీసులు చెబుతున్నారు.

New Update
Kolkata : కోల్‌కత్తా అత్యాచారం సంఘటనలో వెలుగులోకి నమ్మలేని నిజాలు

Trainee Doctor Rape Case:పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లో ట్రైనీ డాక్టర్‌ (Trainee Doctor) ను హత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ అతడి తల్లి మాలతీ రాయ్ మాత్రం తన కొడుకు నిర్ధోషి అని.. పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును ఒప్పకున్నాడని ఆరోపించింది. అయితే ఇతను ఎప్పటి నుంచో చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడని..నాలుగు పెళ్ళిళ్ళను చేసుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అతడి దుష్ప్రవర్తన వల్లే ముగ్గురు భార్యలు విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తరుచూ తాగిన మత్తులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడని స్థానికులు తెలిపారు.

ఇప్పుడు ట్రైనీ డాక్టర్‌‌ను రేప్ చేసి చంపేసిన కేసులో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిని విచారిస్తున్నారు. ఈ విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్‌‌ను చంపేసిన తర్వాత సంజయ్ ఇంటికి వెళ్ళాక హాయిగా పడుకున్నాడు. ఆ తరువాత ఉదయం లేచి తన బట్టల మీద ఉన్న రక్తపు మరకలను తుడిచిపెట్టేందుకు వాటిని ఉతుక్కున్నాడు. అయితే బూట్ల మీద మరకల గురించి మాత్రం మర్చిపోయాడు. పోలీసులు వీటి ఆధారంగానే సంజయ్‌ను అరెస్ట్ చేశారు.

ట్రైనీ డాక్టర్‌‌ను సంజయ్ మొదట హత్య చేసి ఆ తరువాత రేప్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక పోస్ట్‌మార్టమ్‌ నివేదిక ప్రకారం.. ఆమె కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయ్యింది. ముఖం, గోళ్లపై గాయాలయ్యాయి. అలాగే బాధితురాలి మెడ, కడుపు, కుడి చేయి, ఎడమ కాలు, పెదవులు, చేతి వేళ్లపై గాయాలయ్యాయి. అంతేకాదు ఆమె ప్రైవేటు అవయవం నుంచి కూడా బ్లీడింగ్ అయినట్లు తెలుస్తోంది. దీని ద్వారానే మొదట హత్య చేసి తరువాత అత్యాచారం చేశాడని అంచనా వేస్తున్నామని పోలీసులు చెప్పారు. తుది పోస్ట్ మార్టం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

Also Read: Olympics Winners: ఆగస్టు 15న ఒలింపిక్స్‌ విజేతలతో ప్రధాని భేటీ

Advertisment
తాజా కథనాలు