బస్సులు, రైళ్లలో వెళ్తున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు మహిళలను వేధింపులకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా రైలులో వేధించిన వ్యక్తికి ఓ మహిళ బుద్ధి చెప్పింది. అతడి చెంపపై చెప్పు దెబ్బలు వేస్తూ.. చివరికి అతడి ప్రైవేట్ భాగాలపై కూడా చెప్పుతో కొట్టింది. అసలేం జరిగిందంటే.. ఒక ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి పక్కన ఓ మహిళ వచ్చి కూర్చుంది. అయితే ఆ వ్యక్తి ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ కోపంతో రగిలిపోయింది. వెంటనే తన చెప్పు అందుకొని అతడి చెంప చెల్లుమనిపించింది. అలా పలుమార్లు చెంపపై కొడుతూనే ఉంది.
Also read: ఆర్టికల్ 370 రద్దుని కాంగ్రెస్ అడ్డుకుంది.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ఆ మహిళ అంతటితో ఆగకుండా.. ఆ వ్యక్తి ప్రైవేట్ భాగలపై కూడా చెప్పుతో కొట్టింది. అయితే ఆమె దాడిని తట్టుకోలేక అతడు సీటు నుంచి లేచిపోయేందుకు ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆ మహిళ అతడ్ని వదలలేదు. సీటు పైకి ఎక్కీ మరి ఆ వ్యక్తిని చెప్పుతో ఎడాపెడా వాయించేసింది. అక్కడున్న మిగతా ప్రయాణికులు ఆమెకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఆమె వారిని పట్టించుకోలేదు. ఆ సంఘటనను అందులో ఆ రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటీజన్లు విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
Also read: లేనివి ఉన్నట్లుగా, శబ్ధాలను వింటున్నట్లుగా.. టన్నల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది!