Africa : తరుముకొస్తున్న మంకీపాక్స్.. ఆఫ్రికాలో హెల్త్ ఎమర్జెన్సీ!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ మ‌హ‌మ్మారిని తాజాగా గ్లోబ‌ల్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా ప్రక‌టించింది. రిప‌బ్లిక్ ఆఫ్ కాంగో నుంచి పొరుగు దేశాల‌కు ఈ వ్యాధి విస్తరిస్తుండ‌టంతో WHO ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అరిక‌ట్టడానికి ఇప్పటికే చ‌ర్యలు చేప‌ట్టింది.

New Update
Delhi AIIMS: మంకీపాక్స్ పై అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఢిల్లీ ఎయిమ్స్‌ కీలక మార్గదర్శకాలు!

Monkeypox : ఆఫ్రికా (Africa) లో రోజురోజుకి మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆఫ్రికన్‌ యూనియన్ హెల్త్‌ వాచ్‌డాగ్‌ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వ్యాప్తి అనేక ఆఫ్రికన్ దేశాలలో , ముఖ్యంగా డెమోక్రాటిక్‌ రిపబ్లిక్ ఆఫ్‌ కాంగోలో అతిగా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ ను కాంటినెంటల్ సెక్యూరిటీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా (Health Emergency) ప్రకటిస్తున్నాము" అని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధిపతి జీన్ కసేయా చెప్పారు.కరోనా కంటే మంకీ పాక్స్ డేంజర్ అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

మంకీపాక్స్ ఇప్పుడు సరిహద్దులను దాటింది, మన ఖండం అంతటా వేలాది మందిని ప్రభావితం చేస్తుంది. ఎన్నో కుటుంబాలు దీని వల్ల రోడ్డున పడిపోయాయి. ఖండంలోని ప్రతి మూల దీని ప్రభావం తాకింది. వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి రేటు ఆందోళనకరంగా ఉందని సీడీసీ గత వారం హెచ్చరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ మ‌హ‌మ్మారిని తాజాగా గ్లోబ‌ల్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా ప్రక‌టించింది. రిప‌బ్లిక్ ఆఫ్ కాంగో నుంచి పొరుగు దేశాల‌కు ఈ వ్యాధి విస్తరిస్తుండ‌టంతో WHO ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అరిక‌ట్టడానికి ఇప్పటికే చ‌ర్యలు చేప‌ట్టింది.ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్ బుధవారం నాడు ను మంకీపాక్స్‌ నివారణ చర్యల్లో భాగంగా డబ్ల్యూహెచ్‌ఓ ఆకస్మిక నిధులలో $1.5 మిలియన్లను విడుదల చేసినట్లు ప్రకటించారు. దీని కోసం ఇతర దేశాల నేతలు కూడా సహకరించాలని కోరారు.

ఈ సంవత్సరం ఇప్పటివరకు ఖండంలో 15,000 మంకీపాక్స్‌ కేసులు, 461 మరణాలు నమోదయ్యాయని, ఇది గత సంవత్సరంతో ఈ సమయానికి పోలిస్తే 160% పెరుగుదలను సూచిస్తుందని అధికారులు తెలియజేశారు.ఈ ముప్పును అరికట్టడానికి, తొలగించడానికి మా ప్రయత్నాలలో అందరూ చురుకుగా ఉండాలని కసేయా అన్నారు.

Also Read: మాజీ మంత్రి జోగి రమేష్‌కు నోటీసులు

మంకీపాక్స్‌ అనేది ఒకరి నుంచి మరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఫ్లూ లాంటి లక్షణాలు, చీముతో నిండిన గాయాలకు కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో ఇది వ్యక్తి మరణానికి కూడా కారణం కావొచ్చు. కాంగోలో మంకీపాక్స్‌ అనేది క్లాడ్ I అని పిలిచే ఒక స్థానిక జాతి వ్యాప్తితో ప్రారంభమైంది. అయితే క్లాడ్ Ib అని పిలిచే కొత్త వేరియంట్, సాధారణ సన్నిహిత పరిచయం ద్వారా, ముఖ్యంగా పిల్లలలో మరింత సులభంగా వ్యాప్తి చెందుతుంది.

1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మానవులలో మొదటిసారిగా దీనిని గుర్తించారు. ఆ తర్వాత దశాబ్దాలుగా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ ఉంది.ఈ వైరస్ 2022లో సుమారు వందకు పైగా దేశాలకు వ్యాపించింది, ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులునిర్థారించారు.

ఎలా వ్యాపిస్తుందంటే..

సాధారణంగా మంకీపాక్స్ కోతులు, ఎలుకలు, ఉడుతల వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు కొంచెం తక్కువే కానీ.. అత్యంత సన్నిహితంగా ఉంటే మాత్రం ఇది త్వరగా సోకే అవకాశాలున్నాయి. చర్మం పగుళ్లు, శ్వాసకోశ వ్యవస్థ, కళ్లు, నోటి ద్వారా ఇది సంక్రమిస్తుంది.

Advertisment
తాజా కథనాలు