Floods : ఆకస్మిక వరదలు.. 84 మంది మృతి.. కొట్టుకుపోయిన వందల ఇళ్లు!

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదల వల్ల సుమారు 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శనివారం రాత్రి ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని అధికార ప్రతినిధి ఇస్మతుల్లా మురాది తెలిపారు.

Floods : ఆకస్మిక వరదలు.. 84 మంది మృతి.. కొట్టుకుపోయిన వందల ఇళ్లు!
New Update

Afghanistan : ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల (Heavy Rains) కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదల వల్ల సుమారు 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శనివారం రాత్రి ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని ఫర్యాబ్ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి ఇస్మతుల్లా మురాది తెలిపారు. ఇది వరదలకు (Floods) కారణమైంది. ఈ వరదల్లో 66 మంది మరణించారు.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.. ఎనిమిది మంది వరదలో కొట్టుకుపోయారు. శుక్రవారం వరదల వల్ల మరికొందరు మరణించారని తెలిపారు.

1,500 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయని మురడి తెలిపారు. వందల ఎకరాల వ్యవసాయ భూమి (Agricultural Land) నాశనమై 300కు పైగా జంతువులు కొట్టుకుపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ అసాధారణంగా భారీ కాలానుగుణ వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. పశ్చిమ ప్రావిన్స్ ఆఫ్ గోర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ హమాస్ ప్రకారం,ప్రావిన్స్‌లో శుక్రవారం వరదల్లో 50 మంది మరణించారు.

Also read: ఇరాన్ అధ్యక్షుడు మృతి!

#heavy-rains #floods #afganisthan #84-died
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe