ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు బోలెడు ప్రశంసలు లభిస్తున్నాయి. వారిని భారతీయులు విపరీతంగా పొగిడేస్తున్నారు. ఎవ్వరికీ లేని ఆలోచనతో ఇంత మంచి పని చేసినందుకు తెగ పొగిడేస్తున్నారు కూడా. ఇదంతా ఆ దేశపు రహమానుల్లా గుర్బాజ్ వల్లనే జరిగింది. ఈ ఆఫ్ఘాన్ యువ ఓపెనర్...నిన్న దీపావళి రోజున అహ్మదాబాద్ వీధుల్లో నిరాశ్రయులకు డబ్బులు పంచాడు. అర్ధరాత్రి 3గంటలకు వీధుల్లో పడుకుని ఉన్నవారిని లేపి పండుగ కానుక అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కోలకత్తా నైట్ రైడర్స్ దీన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. గుర్బాజ్ నైట్ రైడర్స్ టీమ్ లో ఒకడు.
Also read:ఏపీలో కులగణన కోసం ప్రత్యేక యాప్.. వారంలోపే పూర్తి సర్వే
ఆఫఘాన్ క్రికెట్ ఇంతలా అభివృద్ధి చెందడానికి కారణం టీమ్ ఇండియానే అంటారు దీన్ని ఆ దేశ క్రికెటర్లు కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ఈవిషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. ఈ అభిమానం క్రికెట్ తోనే ఆగిపోకుండా రహమానుల్లా మరొక అడుగు ముందేకేశాడు. ఇప్పుడు నిరాశ్రయులకు పండుగ కానుక అందించిన అతను లాస్ట్ మంత్ లో భారీ భూకంపంలో నష్టపోయిన వారికి ఫండ్ రైజ్ చేసి డబ్బులు అందజేశాడు. ఈ విషయాన్ని చెబుతూ కోలకత్తా నైట్ రైడర్స్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం డబ్బులున్న వీడియోను ట్యాగ్ చేస్తూ గుర్బాజ్ నువ్వు నీ చర్యతో ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచావు. ఇలాగేముందు సాగు అంటూ కేకేఆర్ అభినందనలు తెలిపింది. గుర్బాజ్ చేసిన పనికి నెటిజన్లు కూడా శభాష్ అంటున్నారు.