IPL : ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి ... ఐపీఎల్ కు వెళ్లి.. బాస్ కి అడ్డంగా బుక్ అయ్యింది! ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పిన ఓ యువతి.. ఐపీఎల్ 2024 మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు అడ్డంగా దొరికిపోయింది.స్టేడియంలో ఎంజాయ్ చేస్తున్న నేహాను కెమెరామెన్ పెద్ద ఎల్‌ఈడీ మీద చూపించాడు. అదే సమయంలో టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న ఆమె బాస్ ఆమెని చూశాడు. తను నేహానే అని గుర్తుపట్టేశాడు. By Bhavana 09 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Family Emergency : ప్రస్తుతం ఐపీఎల్(IPL) ఫీవర్ నడుస్తుంది. దానికి తగ్గట్లే మ్యాచులు కూడా మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. క్రికెట్ ప్రేమికులంతా ఐపీఎల్‌ను మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది అభిమానులు అయితే తమ అభిమాన క్రికెటర్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియంలకు వెళ్తుంటారు కూడా. కొందరు ఉద్యోగులు అయితే సెలవులు పెట్టుకుని మరీ స్టేడియాలకు పరుగులు పెడుతున్నారు. కొందరు అయితే ఆరోగ్యం బాలేదని, ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి.. ముందుగానే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసి స్టేడియంలకు వెళ్లి మ్యాచులు చూసేస్తున్నారు. అయితే ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పిన ఓ యువతి.. ఐపీఎల్ 2024(IPL 2024) మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు అడ్డంగా దొరికిపోయింది. బెంగళూరుకు చెందిన ‘నేహా ద్వివేది’(Neha Dwivedi) అనే ఓ మహిళ బెంగళూరు జట్టుకు వీరాభిమాని. ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూడ్డానికి నేహా తన బాస్‌కు ఓ సూపర్ అబద్దం చెప్పింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి.. ఆఫీస్ నుంచి ముందుగానే బయటకు వచ్చి స్టేడియంకు చెక్కెసింది. మ్యాచ్ జరుగుతుండగా.. స్టేడియంలో ఎంజాయ్ చేస్తున్న నేహాను కెమెరామెన్ పెద్ద ఎల్‌ఈడీ మీద చూపించాడు. అదే సమయంలో టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న ఆమె బాస్ ఆమెని చూశాడు. తను నేహానే అని గుర్తుపట్టేశాడు. మరుసటి రోజు నేహా ద్వివేదికి ఆమె బాస్ మెసేజ్ చేశాడు. మీరు బెంగళూరు అభిమాని కాదా? అని అడగ్గా.. దానికి నేహా యస్ అని సమాధానం ఇచ్చింది. 16.3 ఓవర్లో కీపర్ క్యాచ్ మిస్ చేసినందుకు నువ్వు చాలా ఫీల్ అయ్యావు కదా? అని బాస్ ప్రశ్నించాడు. అనుజ్ రావత్ క్యాచ్ మిస్ చేశాడు సర్ అంటూ నేహా రిప్లై ఇచ్చింది. నేను నిన్ను స్టేడియంలో చూశాను, అందుకేనా నువ్వు నిన్న త్వరగా ఆఫీస్ నుంచి వెళ్లిపోయావు అంటూ బాస్ అడగడంతో ఆమె షాక్ గురైంది. ఈ చాట్ మొత్తాన్ని నేహా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. Also read: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్! #social-media #ipl #stadium #neha-dwivedi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి