నాగార్జున అరెస్ట్ తప్పదా..? బిగ్ బాస్ పై హైకోర్టు లో పిటిషన్ బిగ్ బాస్ షోపేరుతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అడ్వకేట్ అరుణ్ కుమార్. 100 రోజులపాటు కంటెస్టెంట్లను అక్రమంగా నిర్బంధించిన నాగార్జునపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. By srinivas 19 Dec 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి ఈ యేడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 7ను వివాదాలు చుట్టుముట్టాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానుల మధ్య అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాలపై దాడులు చేసి హంగామా సృష్టించడంతో పల్లవి ప్రశాంత్ తో పాటు పలువురిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోపై అడ్వకేట్ అరుణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు బిగ్ బాస్ షో పేరుతో 100 రోజులపాటు కంటెస్టెంట్లను అక్రమంగా నిర్బంధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అరుణ్ కుమార్ పిటిషన్ వేశారు. అలాగే ఈ చర్యలకు పాల్పడ్డ బిగ్ బాస్ నిర్వాహకుడు, నటుడు నాగార్జునపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పిటిషన్ లో పేర్కొ్న్నారు. ఇలాంటి షోలతో ప్రజలను తప్పుదారి పట్టించడంతోపాటు బిగ్ బాస్ హౌస్ లో అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడం వెనుక ఉన్న కుట్రపై విచారణ జరిపి.. బిగ్ బాస్ పోటీలో ఉన్న వారిని విచారించి అసలు నిజాలన్నీ రాబట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇంతటితో ఆగకుండా బిగ్ బాస్ షోలో చోటు చేసుకున్న పలు అంశాలపై మహిళ కమిషన్ ఛైర్మన్ కు కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి : Hyderabad: హైదరాబాదీలకు బిగ్ షాక్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఇక ఆర్టీసీ బస్సులపై దాడులు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు ఎండీ వీసీ సజ్జనార్. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దంతో పాటు పోలీస్ బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా ధ్వంసం చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రాత్రి 12 గంటల టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అభిమానులు ప్రశాంత్ కు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్ దీప్ కూడా బయటకు రావడంతో ఇరువురి ఫ్యాన్స్ మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. దీంతో రెచ్చిపోయిన కొందరు అభిమానులు అమర్ దీప్, మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు. ఈ దాడిలో అమర్ దీప్, అశ్వినీ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలపై జూబ్లీహిల్స్ పోలీసులు నమోదుచేశారు. #high-court #bigg-boss #nagarjuna #arun-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి