ISRO: సూర్యుని అరుదైన ఫొటోలు తీసిన ఆదిత్య ఎల్-1

ఆదిత్య ఎల్‌-1 సూర్యుని అరుదైన ఫొటోలు తీసింది. సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ పేలోడ్‌ సూర్యుని నుంచి 200 నుంచి 400 నానో మీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలోని ఫొటోలను తీసింది. దీనివల్ల సూర్యుని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌లకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

New Update
ISRO: సూర్యుని అరుదైన ఫొటోలు తీసిన ఆదిత్య ఎల్-1

చంద్రయాన్ -3 సక్సెస్ తర్వాత సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన ఆదిత్య ఎల్‌-1 మరో పురోగతి సాధించింది. సూర్యుని అరుదైన చిత్రాలను క్లిక్‌ మనిపించింది. అతినీలలోహిత తరంగ దైర్ఘ్యం దగ్గర నుంచి సూర్యుని ఫొటోలను తీసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇస్రో షేర్ చేసింది. సౌర కుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయంటూ పేర్కొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదిత్య ఎల్‌1 లోని సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ పేలోడ్‌ సూర్యుని నుంచి 200 నుంచి 400 నానో మీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలోని ఫొటోలను తీసింది. అయితే ఈ చిత్రాల నుంచి సూర్యుని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌లకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది. అయస్కాంక క్షేత్రానికి సంబంధించి తెలుసుకోవడంలో ఈ చిత్రాలు కీలక సమాచారాన్ని అందిస్తాయని ఇస్రో పేర్కొంది.

Also Read: రష్యాలో మార్చిలో ఎన్నికలు.. పుతిన్ పోటీ చేస్తారా..?

సూర్యూనిపై పరిశోధనలు చేసేందుకు ఈఏడాది సెప్టెంబర్‌ 2న ఆదిత్య ఎల్-1 నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యోమనౌక తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంది. అయితే దీన్ని ఎల్‌1 పాయింట్ వద్ద ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతాయని ఇస్రో తెలిపింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజ్‌ పాయింట్-1కు చేరుకొని.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యునిపై పరిశోధనలు చేస్తుంది. దీనివల్ల సూర్యూనికి సంబంధించి ఇస్రో మరింత సమాచారం సేకరించేందుకు వీలుంటుంది.

Also Read: కుర్ర టీం కుమ్మేసింది.. అండర్-19 ఆసియాకప్‌లో భారత్ శుభారంభం

Advertisment
తాజా కథనాలు