Dry Fruits Milk Best: పాలలో చక్కెరకు బదులు వీటిని ఎప్పుడైనా కలిపారా..? ఒక్కసారి ట్రై చేయండి

పిల్లలు పాలు ఇష్టంగా తాగాలంటే ఈ ఐదు పదార్థాలను పాలతో కలిపి ఇవ్వండి. డ్రై ఫ్రూట్స్, తేనె, డాలియా, బాదం, షేక్స్, కార్న్ ఫ్లేక్స్‌ని పాలతో కలిపి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుల్లుగా లాగిస్తారు.

Dry Fruits Milk Best: పాలలో చక్కెరకు బదులు వీటిని ఎప్పుడైనా కలిపారా..? ఒక్కసారి ట్రై చేయండి
New Update

పాలు అంటే చాలామందికి తాగడం ఇష్టం ఉండదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలను ఉదయం, సాయంత్రం తాగాలని డాక్టర్లు చెబుతున్నా.. దీనిని ఎవరు పాటించరు. పాలలో ఉండే కాల్షియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే రోజు పాలు తాగాలి. చిన్న పిల్లల అభివృద్ధికి పాలు చాలా ముఖ్యం. సాధారణంగా చిన్నపిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు పిల్లలకి పాలు తాగించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ పాలు పిల్లలు పెరిగేందుకు ఉపయోగపడతాయి. అందుకే చిన్న పిల్లలకి పాలు ఎక్కువగా ఇస్తుంటారు. పాలలో ఎక్కువ కాల్షియంతో పాటు ఇందులో భాస్వరం, విటమిన్ డి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలను రోజూ తాగితే ఎముకలను బలంగా ఉంచుతుంది. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ.. పిల్లలు పాలు ఇష్టంగా తాగాలంటే కొన్ని చిట్కాలను పాటించడం అవసరం. దీంతో పిల్లలు సులభంగా పాలు తాగుతారు. మీ పిల్లలకు ఆరోగ్యకరమైన రీతిలో పాలు ఎలా తాగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలలో ఈ ఐదు వస్తువులను కలపండి:
డ్రై ఫ్రూట్స్, తేనె: పాలలో డ్రై ఫ్రూట్స్, తేనె కలిపి పిల్లలకు ఇస్తే ఎంతో ఇష్టంగా తాగుతారు. బాదం, జీడిపప్పు, ఖర్జూరం అంజీర్‌ వంటివి పాలలో ఇస్తే పోషకలతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో తేనెను కలిపి ఇస్తే ఇంకా రుచిని ఇస్తుంది.
డాలియా: చాలామంది గంజి పడేస్తారు. ఈ గంజితో పాలు కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా తాగటం వలన పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.
బాదం పాలు: పిల్లలు బాదం పాలు ఎంతో ఇష్టంగా తాగుతారు. బాదాన్ని పాలలో రోజూ కలిపి ఇస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుంది. బాదంలో ఉండే విటమిన్-ఇ, భాస్వరం చర్మానికి మేలు చేసి ఎముకలను బలపరుస్తుంది.
షేక్స్: సాధారణ పాలకు బదులుగా పిల్లలకు షేక్ ఇస్తారు. అరటిపండ్లు, మామిడి, స్ట్రాబెర్రీలు వంటి పండ్లతో షేక్ చేసి ఇస్తారు. ఇలా చిన్నారులకు పాలు ఇస్తే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కార్న్ ఫ్లేక్స్: పిల్లలు పాలు తాగకపోతే.. పాలతో కార్న్‌ఫ్లేక్స్ కలిపి ఇవ్వవచ్చు. కార్న్ ఫ్లేక్స్ అనేది మొక్కజొన్నతో తయారు చేసిన తృణధాన్యం. దీనిలో డ్రై బెర్రీలు కానీ డ్రై ఫ్రూట్స్ కలిపితే దాని రుచి మరింత ఎక్కువ పెరిగి పిల్లలు ఇష్టంగా లాగిస్తారు.

ఇది కూడా చదవండి: బాక్సర్లుగా మారిన గోరిల్లాలు..జూలో భీకర పోరు

#health-benefits #dry-fruits #milk
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe