Addanki Dayakar: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తన పేరును కాంగ్రెస్ అధిష్టానం చేర్చకపోవడంపై స్పందించారు అద్దంకి దయాకర్. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని అన్నారు. తనపై కుట్ర జరిగిందనడంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తన అభిమానులు నిరాశ చెందొద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ సహనంతో ఉండాలని కోరారు. త్వరలో తనకు మంచి పదవి రావచ్చని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం తన పట్ల సానుకూల వైఖరితో ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ తనతో మాట్లాడినట్లు తెలిపారు. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన
అద్దంకికి అడ్డంకులు..
అద్దంకి దయాకర్ కు అడుగడునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా అద్దంకికి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ (Congress) హైకమాండ్. ఈ నెల 29న జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు అద్దంకి దయాకర్ పేరును కాంగ్రెస్ ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందరు కూడా అద్దంకికి ఎమ్మెల్సీ పదవి రాబోతుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
జరుగుతున్న చర్చలకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ లో (MLC List) నుంచి తీసేసింది. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ లిస్టులో మహేష్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) , బల్మూరి వెంకట్ (Balmoor Venkat narsing) పేర్లను అధికారికంగా ప్రకటించింది. అద్దంకి దయాకర్ బదులుగా మహేష్ కుమార్ గౌడ్ పేరును చేర్చింది. దీంతో ఎమ్మెల్సీ అవుతానని కోటి ఆశలతో ఉన్న అద్దంకి దయాకర్ కు ఈసారి కూడా అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు రేపు తుది గడువు.
ఇది కూడా చదవండి: Rythu Bandhu: రైతు బంధుపై కీలక అప్డేట్